గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 27, 2020 , 23:13:31

కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’

కొనసాగుతున్న ‘పట్టణ ప్రగతి’

నాగర్‌కర్నూట్‌ టౌన్‌ : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో వీధులు బాగుపడుతున్నాయి. గురువారం జిల్లా కేంద్రంలోని 10, 13 వార్డుల్లో ప్రగతి పనులను కౌన్సిలర్లు బాదం సునీత, కావలి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వార్డులోని పలు వీధులను శుభ్రం చేశారు. ఖాళీ స్థలాల్లో  ముళ్లకంపను శుభ్రం చేశారు. 10వ వార్డులో ఇన్‌చార్జి శివశంకర్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ముమ్మరంగా చేపట్టారు.13వ వార్డుల్లోల్లో పేరుకుపోయిన ముళ్లపొదలను, అస్తవ్యస్తంగా మారిన ప్రదేశాలను శుభ్ర పరిచారు. కార్యక్రమంలో ఇన్‌చార్జిలు రాము, శేఖర్‌, యాదగిరిరావు, యూత్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌సాగర్‌, స్టార్‌ కుమార్‌ వార్డు ప్రజలు పాల్గొన్నారు. 


logo