ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 27, 2020 , 04:03:01

సుందర పట్టణంగా పాలమూరు

సుందర పట్టణంగా పాలమూరు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: సుందర పట్టణంగా పాలమూరును తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివా స్‌గౌడ్‌ అన్నారు. బుధవారం పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణ పరిధిలోని 4, 5వ వార్డు హౌసింగ్‌ బోర్డుకాలనీలో కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి పర్యటించారు. వార్డులో తిరిగి పారిశుధ్య పనులతోపాటు డ్రైనేజీలు, లీకేజీలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకు పట్టణ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ప్రతి సమస్య పరిష్కరానికి కృషి చేశామని తెలిపారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆలోచన, ఆదేశాల మేరకు ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రణాళికను నిర్మాణాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 2014 కంటే ముందు పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. రోడ్లు, సీసీరోడ్లులేని దుస్థితి ఉండేది. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి వార్డులో అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరానికి కృషి చేశామని తెలిపారు. చెత్తరహిత పట్టణంగా మహబూబ్‌నగర్‌ తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రోడ్లు, ఇళ్ల మధ్య చెత్త వేయొద్దని, ప్రతి వార్డులో యువత అవగాహన కల్పించాలని కోరారు. హౌసింగ్‌ బోర్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో కేవలం మున్సిపాలిటీ అంటే కేవలం మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది మాత్రమే వచ్చేవారని, ఇప్పడు జిల్లా స్థాయి అధికారులు ముందుకొచ్చి పట్టణ ప్రగతిలో పాల్గొని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నారన్నారు. వార్డు కమిటీలు సమస్యలు గుర్తించి అధికారుల దృష్టి తీసుకరావాలని కోరారు. ఉదయం బోయపల్లిగేట్‌, సుభాష్‌నగర్‌లో కలెక్టర్‌ వెంకట్రావు పర్వటించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, సింగిల్‌ విండో చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సురేందర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌, డీఈవో ఉషారాణి, కౌన్సిలర్లు యాదమ్మ, కోరమోని వనజా, తాసిల్దార్‌ పార్థసారథి, గిర్దావర్‌ క్రాంతి, నాయకులు హన్మంతు, వెంకన్న, మాజీ కౌన్సిలర్‌ రాశద్‌ఖాన్‌, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎరుకల సమస్యలపై సానుకూలంగా ప్రభుత్వం

మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తా: జిల్లాలో ఎరుకల సంక్షేమ సంఘం, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎరుకలి కులస్తుల పిల్లలకు చదువుల కోసం సంక్షేమ పథకాలను అందిస్తున్నామని.. వారి అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానన్నారు. అనంతరం ఎరుకలి సంఘం ఆధ్వర్యంలో సింగిల్‌విండో డైరెక్టర్‌గా ఎన్నికైన తూడుకుర్తి రాములు, జర్నలిస్టు బండి విజయ్‌కుమార్‌ను సన్మానించారు. అనంతరం ఎరుకలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొన్నకల్‌ కృష్ణయ్య, బాలయ్య, పర్వతాలు, గిరిబాబు, చెన్నప్ప, రాంచంద్రయ్య, రాములు, కృష్ణయ్య, రాజు, కొండన్న, శాంతన్న పాల్గొన్నారు.

భూలక్ష్మీమాత విగ్రహ  ప్రతిష్ఠాపన

మహబూబ్‌నగర్‌ సాంస్కృతిక విభాగం: పట్టణంలోని భగీరథ కాలనీలోని ఎన్‌క్లేవ్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం భూలక్ష్మీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన పూజలు చేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు.  సందర్భంగా మంత్రి పూజలు నిర్వహించారు. 

అందరికీ అండగా సర్కారు

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ: అందరికీ అండగా ప్రభుత్వం ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వెంకటేశ్వరకాలనీ చెందిన సయ్యద్‌ ఆయాబ్‌ అహ్మద్‌కు రూ.3లక్షలు, బండ్లగేరికి చెందిన రవికుమార్‌కు రూ.2లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోఎస్‌ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్‌, గంజి వెంకన్న, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌, తదితరులు ఉన్నారు.logo