శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 26, 2020 , 01:44:22

మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పించిన మంత్రి కేటీఆర్‌

మున్సిపల్‌ చట్టంపై అవగాహన కల్పించిన మంత్రి కేటీఆర్‌

పట్టణ ప్రగతిలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కల్వకుర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, వార్డు కమిటీల సభ్యులతో మంత్రి ముఖాముఖిగా ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ఆలోచనా విధానంలో మార్పురావాలని, పట్టణాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలని, పచ్చదనం పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.    

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు మెడికల్‌ కళాశాలతో పాటు ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేయాలి. గద్వాల- మార్చాల రైలు మార్గం కొరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నా. పల్లె ప్రగతితో గ్రామాలు పరిశుభ్రంగా మారుతున్నాయి. అలాగే పట్టణాలను అభివృద్ధి చేసుకుందాం. రాష్ట్ర ప్రగతే నినాదంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ముందుకు సాగుదాం.

 - పోతుగంటి రాములు, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

నెల రోజుల్లో కల్వకుర్తి పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహిత కల్వకుర్తిగా రూపుదిద్దే విధంగా కంకణం కట్టుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటిస్తాం. పట్టణ ప్రగతిలో కల్వకుర్తిని అంచలంచలుగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాం. కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ను కోరుకుంటున్నాను.

- ఎడ్మ సత్యం, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌

అభివృద్ధికి తొలిమెట్టు

పట్టణ అభివృద్ధికి మొదటి మెట్టు పట్టణ ప్రగతి. పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. పట్టణాలు అభివృద్ధి చెందేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సీఎం రూపొందించారు. 10 రోజుల పాటు సాగే పట్టణ ప్రగతిలో పారిశుధ్య పనులతో పాటు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. మన ఇల్లు, మన పట్టణం అనే సంస్కృతిని అలవర్చుకోవాలని. వివిధ గ్రాంటులు, ఆస్తి పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం మొక్కల పెంపకం వాటి సంరక్షణకు ఉపయోగించాలి. 

- శ్రీధర్‌, కలెక్టర్‌


logo