శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 26, 2020 , 01:39:09

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

రోడ్లపై చెత్త వేస్తే జరిమానా

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: పట్టణాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని, సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పర్చుకోవాలని  కలెక్టర్‌ శ్రీధర్‌ సూచించారు. పట్టణ ప్రగతిలో భా  కలెక్టర్‌ మంగళవారం మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో కమిషనర్‌ అన్వేశ్‌, కౌన్సిలర్లు జక్కా రాజ్‌కుమార్‌రెడ్డి, కావలి శ్రీనివాసులు, ఖాజాఖాన్‌తో కలిసి 12, 13, 15, 18వ వార్డుల్లో పర్యటించి కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.    పట్టణంలోని మహబూబ్‌సుబానీ దర్గా, ఈదమ్మగుడి, శ్రీనగర్‌ కాలనీ, దళిత వాడ ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. ఖాళీ స్థలాలతోపాటు శిథిలావస్థలో ఉన్న ఇండ్ల  నోటీసులు ఇచ్చి శుభ్ర పరుచుకోవాల్సిందిగా నోటీసులు ఇవ్వండని కమిషనర్‌ను ఆదేశించారు.  6 గంటల నుంచి 9 గంటల వరకు దాదాపు మూడు గంటలపాటు కాలనీల్లో కలెక్టర్‌ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.  చెత్తను తీసుకెళ్లేందుకు కాలనీకి చెత్త బండ్లు వస్తున్నాయా లేదా అనే విషయాలను ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ స్తంభాల వద్ద ప్రమాదకరంగా ఉన్న తీగలను సరి    ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజ్‌కుమార్‌రెడ్డి, కావలి శ్రీనివాస్‌, ఖాజాఖాన్‌, అప్పల ఇందిర, బాదం సునీత, శకుంతలాబాయి, టీఆర్‌ఎస్‌ నాయకులు భాస్కర్‌గౌడ్‌, నరేందర్‌, మోతీకుమార్‌, ఆయా వార్డులకు సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు.

ప్రారంభమైన ప్రగతి పనులు...

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో ప్రగతి పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం 10వ వార్డులో కౌన్సిలర్‌ సునీత, మున్సిపల్‌ పరిధిలోని ఎండబెట్ల గ్రామమైన 2వ వార్డులో కౌన్సిలర్‌ అప్పల ఇందిర శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రగతి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా పలు వీధుల్లో, రోడ్లకు ఇరువైపుల ఉన్న ముళ్ల చెట్లను తొలగించి శుభ్రం చేశారు.  అదే ఙువిధంగా ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈకార్యక్రమంలో ప్రత్యేకాధికారి శివశంకర్‌, స్టార్‌ కుమార్‌, యూత్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌సాగర్‌, విష్ణుమూర్తి, కాలనీ వాసులు పాల్గొన్నారు. 

హరితహారానికి మొక్కలను సిద్ధం చేయాలి.

కల్వకుర్తి రూరల్‌ : గ్రామాల్లో  నర్సరీ కేంద్రాలలో గ్రామాలకు అవసరమైన విధంగా హరితహారం మొక్కలను నాటేందుకు సిద్దం చేయాలని  కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. మంగళవారం  కల్వకుర్తి మండలం సుద్దకల్‌, తర్నికల్‌ గ్రామాలలోని నర్సరీలను కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. నర్సరీలలో పెంచిన మొక్కలను, సిద్ధం చేస్తున్న మొక్కల ప్రగతిని పరిశీలించారు.  గ్రామంలో నాటిన మొక్కలను కాపాడుకునేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.  ఆయన వెంట డీఆర్‌డీవో సుధాకర్‌, ఏపీడీ గోవిందరాజు, ఏపీవో  గ్రామ సర్పంచులు పాండుగౌడ్‌,నాయకులు రాంరెడ్డి, గ్రామాల కార్యదర్శులు తదితరులు ఉన్నారు.


logo