శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 26, 2020 , 01:38:08

భద్రతాభావం కల్పించేందుకే కార్డన్‌ సెర్చ్‌

భద్రతాభావం కల్పించేందుకే కార్డన్‌ సెర్చ్‌

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: ప్రజల్లో భద్రతాభావం కల్పించేందుకే కార్డన్‌ సె ర్చ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌ పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని 3, 4 వార్డుల్లోని కుర్వవీధి, కుమ్మరి వీ ధి, వడ్డెవీధి, వినాయక్‌నగర్‌లలో సోదా లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ ఎస్పీ, డీఎస్పీ కిరణ్‌కుమార్‌లు స్థానికుల తో మాట్లాడారు. ప్రజలందరి భద్రత కో సమే తాము ఈ సెర్చ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్థి, ప్లాట్లను కొనుగో లు చేసినప్పుడు వాటిని మన పేర్లపైకి ఎ లా మార్చుకుంటామో.. అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కూ డా ధ్రువపత్రాలు తీసుకోవాలని సూచించారు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు కొ నుగోలు చేసినప్పుడు యజమాని పేరు మార్చుకోకపోతే కలిగే ఇబ్బందులను ప్ర జలకు వివరించారు. సరైన పత్రాలు లే కుండా వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదానికి గురైతే మనకు వర్తించే బీమా సై తం వర్తించదన్నారు. కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించినా, అనుమానాస్పందంగా భావించినా వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. ఆడపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 100కు డయల్‌ చేయాలని సూచించా రు. చిన్న పిల్లలకు వాహనాలను ఇస్తే వా రి తల్లిదండ్రులపై కేసులు చేస్తామన్నారు. హెల్మెట్‌ లేకుండా, మద్యం సేవించి ప్రయాణాలు చేస్తే చర్యలు తప్పవని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. పోలీసులు కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహించినప్పుడు ప్రజలు తమకు సహకరించాలని వారు కోరారు. ఈ సందర్బంగా సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్రవాహనాలు, ఓ ఆటోను ఠాణాకు తరలించారు. పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వాహన యజమానులకు సూచించారు. సీఐ సీతయ్య నేతృత్వంలో జరిగిన ఈ నిర్భంధ తనిఖీలలో ఆత్మకూరు ఎస్సై ముత్తయ్య, అమరచింత ఎస్సై ఆంజనేయులు, సర్కిల్‌ పరిధిలోని 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


logo