గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 24, 2020 , 00:01:10

అభివృద్ధితోనే పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి

అభివృద్ధితోనే పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి


నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/బిజినేపల్లి : గ్రామాలు, తండాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి నిర్వహించడం జరుగుతుం  రాష్ట్ర వ్యవసాయాశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాలెం గ్రామంలోని బాలాజి గార్డెన్‌లో పల్లె, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధుల సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయడం జరుగుతుందని, ప్రజల ప్రాతిపదికగా ప్రభుత్వం నడవాలన్నారు. కొత్త మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టాలతో సీఎం కేసీఆర్‌ ప్రజాప్రతినిధులు, అధికారులకు పని చేసే బాధ్యత అప్పజేప్పడం జరిగిందన్నారు. మొదటి విడతలో జరిగిన పల్లె ప్రగతిలో సర్పంచ్‌లు, కార్యదర్శులు అద్భుతంగా పనిచేశారన్నారు. తెలంగాణ బిడ్డ అయిన పూర్ణ పదో తరగతి విద్యార్థి ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కడం జరిగిందన్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు పని చేయాలన్నారు.    పంచాయతీ కార్యదర్శుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.  ఒక రిటైర్డ్‌ ఆర్మి ఉద్యోగి అయిన అన్నాహజారే తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇందుకు నిదర్శనం ఒక మామూలు వ్యక్తి అయిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అహర్నిశలు కష్టించి ఎమ్మెల్యేగా ఎదగడం జరిగిందన్నారు. దీనికి నిదర్శనం ఈయననే అన్నారు. ఎంపీటీసీల బలోపేతానికి కూడా ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం  రాములు మాట్లాడుతూ  ఉద్యోగస్తులు, గ్రామస్తులు కలిసికట్టుగా పనిచేసే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 


రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే గ్రామంలో సర్పంచ్‌లు ముఖ్యమంత్రి అన్నారు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకున్న వారే ధన్యులన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం రూ.330 కోట్లను ప్రతినెలా విడుదల చేయడం జరుగుతుందన్నారు. అదే  మునిసిపాల్టిల అభివృద్ధి కోసం రూ.70కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. పల్లెలు స్వచ్ఛతగా ఉంచాలనే ఉద్దేశంతోనే పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.    పర్సన్‌  పద్మావతి మాట్లాడుతూ  నిర్వహించిన మొదటి విడత పల్లె తైపగతిలాగానే పట్టణ ప్రగతిని కూడా నిర్వహించాలని అన్నారు. మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన గ్రామాలు, తండాలను అంతే శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ ఈ భృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ     పల్లెప్రగతి, పట్టణ ప్రగతిని విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఒక బృందంగా ఏర్పడి రాష్ట్రంలోనే జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువస్తామని  అన్నారు. గ్రామ పటిష్టత కోసం పని చేయాలన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో కార్యదర్శిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 


ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ    గ్రామ సర్పంచ్‌ కథానాయకులుగై అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అభివృద్ధి జరిగిందని, గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ మంచి ఆలోచనతో పట్టణ ప్రగతిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. . సీఎం కేసీఆర్‌ ఆశయం ప్రజలోకి వెళ్లే విధంగా పనులు చేయాలన్నారు. కార్యదర్శులు, సర్పంచ్‌లు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి       హరితహారంలో భాగంగా గ్రామాల్లో ఔషద మొక్కలు పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్మూలన జరుగుతుందన్నారు. పట్టణ ప్రగతి ద్వారా వార్డులో సమస్యలను గుర్తించి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, డీఏవో సింగారెడ్డి, డీఎఫ్‌వో జోజి, డీపీవో సురేశ్‌ మోహన్‌, డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు  


దేశానికే తలమానికం తెలంగాణ కలెక్టర్‌ శ్రీధర్‌

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా అభివృద్ధిలో దూసుకుపోతుందని కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. పది రోజుల్లో పట్టణ ప్రణాళికను పూర్తి చేయాలని, నేటినుంచి పట్టణ ప్రగతి ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులతో నాగర్‌కర్నూల్‌ జిల్లా తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల కింద డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికలు, మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలన్నారు. హరితహారం కింద 80శాతం మొక్కలు బతికించాలన్నారు. 
logo