బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 21, 2020 , 02:17:37

ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తాం

ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తాం

తెలంగాణలో నీటి పారుదలశాఖ కింద ప్రధానమైన ప్రాజెక్టులను సత్వ రం పూర్తిచేసే దశగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసు కున్నారని నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా.రజత్‌కుమార్‌ వెల్లడించారు.

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో నీటి పారుదలశాఖ కింద ప్రధానమైన ప్రాజెక్టులను సత్వ రం పూర్తిచేసే దశగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసు కున్నారని నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా.రజత్‌కుమార్‌ వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలో జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు, సీఎం కార్యాలయం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో కలిసి ఆయన హెలిక్యాప్టర్‌ లో గురువారం గంటలకు ఎల్లూరు  శివారులోని వేపలచెరువు వద్దకు చేరుకున్నారు. ప్రధాన ప్రాజెక్టులో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం సందర్శించి వచ్చారని, అయితే ఈసందర్భంగా ముఖ్యమైన పనులను గురించి సీఎం చాలా కఠిమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. మనకు వర్కింగ్‌ సీజన్‌ జూన్‌, జూలై వరకు ఉంటుందని, వర్షాలు మొ దలైతే ప్రా జెక్టు నిర్మాణ పనులు చేయలేకపోతామని సమ యం వృథా చేయకుండా పనులు పూర్తి చేయాల ని సూచించారు. పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగ తిని పరిశీలన చేసి రివ్యూ చేయడానికి తాము వచ్చా మని, ఈ ప్రాజెక్టులో ఎదురౌతున్న సమస్యలు, వాటి పరిష్కారం పరిశీలన చేయనున్నట్లు రజత్‌కుమార్‌ వెల్లడించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నమూనా ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం వేపలచెరువు వద్ద అసంపూర్తిలో ఉన్న అప్రోచ్‌ కెనాల్‌, పంప్‌హౌస్‌, సర్జిపుల్‌ తవ్వకాలు, ప్యాకేజీ-1లో సొరంగం, ప్యాకేజీ -2లో నార్లాపూర్‌ బండ్‌, బో డబండతండా సమీపంలో స్లూయిస్‌, ప్యాకేజీ-3లో ప్రధాన  ఓపెన్‌ కెనాల్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్‌ నాగలక్ష్మీ, క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ రమశ్రీనివాసరావు,ప్రాజెక్టు ఎస్‌ఈ అశోక్‌, ఆర్డీవో శ్రీరాము, తాసిల్దార్‌  సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.  


పాలమూరు-రంగారెడ్డి పనులు వేగవంతం చేయాలి

గోపాల్‌పేట : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ రజిత్‌కుమార్‌ ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఏదుల రిజర్వాయర్‌ పనులను పరిశీలించా రు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప నుల పురోగతిని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భం గా ఆయన అధికారులతో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబం ధించి భూసేకరణ పనులు, పునరావాస పనులు, బిల్లుల చెల్లింపు పనులను  జాప్యం లే కుండా పూర్తి చేయాలని ఆదేశించారు. భ విష్యత్‌లో భూసేకరణ కారణంగా ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా నోటిఫికేషన్‌ జా రీ, గ్రామాల్లో దండోరా వేయించడం వం టివి పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు సేకరించిన భూముల వివరాలన్నింటిని అప్లోడ్‌ చేయాలన్నారు. ప్రాజెక్టు పనులన్నీ ఒక దశ వరకు వచ్చాయని సీఎం కేసీఆర్‌ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందువల్ల ఇంజినీరింగ్‌ అధికారులు ప్రా జెక్టు పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఆయనతోపాటు సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌ పాం డే, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, సీఈ రమేశ్‌, ఎస్‌ఈ అశోక్‌, ఎగ్జిక్యూటీ ఇంజినీర్‌ విజయభాస్కర్‌రెడ్డి, డిప్యూటీ ఇంజినీర్‌ సత్యనారాయణగౌడ్‌ ఆర్‌డీవో చంద్రారెడ్డి,  నరేందర్‌, లక్ష్మణ్‌రావు ఉన్నారు.logo