శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 19, 2020 , 00:02:40

భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు

భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు

అమ్రాబాద్‌ రూరల్‌: భౌరాపూర్‌ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానియొద్దని అదనపు కలెక్టర్‌ హన్మంతరెడ్డి అధికారులకు ఆదేశించారు. నల్లమల ప్రాంతం లింగాల మండలంలో అప్పాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోగల భౌరాపూర్‌ జాతర ఏర్పాట్లను మంగళవారం ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య, ఆర్డీవో పాండునాయక్‌, డీఎస్పీ నర్సింహులుతో పాటు ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు.

  • తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి
  • వాహనాలకు అనుగుణంగా రహదారిని సరిచేయాలి
  • భౌరాపూర్‌ జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్‌ హన్మంతరెడ్డి
  • అప్పాపూర్‌ చెంచుపెంట సందర్శన

అమ్రాబాద్‌ రూరల్‌: భౌరాపూర్‌ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానియొద్దని అదనపు కలెక్టర్‌ హన్మంతరెడ్డి అధికారులకు ఆదేశించారు. నల్లమల ప్రాంతం లింగాల మండలంలో అప్పాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోగల భౌరాపూర్‌ జాతర ఏర్పాట్లను మంగళవారం ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య, ఆర్డీవో పాండునాయక్‌, డీఎస్పీ నర్సింహులుతో పాటు ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లు పరిశీలించారు. మధ్యాహ్నం భ్రమరాంభిక ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హన్మంతరెడ్డి మాట్లాడుతూ జాతరకు ఎంతమంది భక్తులు, ఆదివాసీలు వస్తారని వివిధ విషయాలపై ఆరాతీశారు. భోజన వసతి, తాగునీరు, తాత్కాలిక శానిటేషన్‌, రవాణా, విద్యుత్‌ సదుపాయం, వివిధ శాఖలకు చెందిన స్టాల్స్‌, గిరిజనులకు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శివపార్వతుల కల్యాణం కోసం ఏర్పాటు చేసే మండపం ఇలా అన్ని రకాల ఏర్పాట్లపై ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య వివరించారు. ముఖ్యంగా తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.


జాతరకు వచ్చే క్రమంలో ఏటీఆర్‌ అడవుల్లో సుమారు 30 కిలో మీటర్లకు పైగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్‌ వ్యక్తులు ఎవరూకూడ చిరు వ్యాపారం చేయడానికి వీలులేదని, కేవలం ఆదివాసీ గిరిజనులు మాత్రమే కొబ్బరికాయలు, ఇతర పూజసామగ్రి, లడ్డు, ప్రసాదం అమ్మెలా చూడాలని ఆదేశించారు. అనంతరం అక్కడి నుంచి అప్పాపూర్‌ పెంటకు చేరుకొని అక్కడ నిత్యవసర సరుకులు అందుతున్నాయా, ఆశ్రమపాఠశాలలో సరిపడా ఉపాధ్యాలుయులు ఉన్నారా, వైద్య సదుపాయాలు అందుతున్నాయా అని ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బాలగురువయ్య, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ప్రత్యేక అధికారి జయరాజు, జీసీసీ మేనేజర్‌ బానుచందర్‌, అకౌంటెంట్‌ జయరాజు, వైద్య అధికారులు, అచ్చంపేట సీఐ, ఐకేపీ ఏఈడీ లక్ష్మయ్య, లింగల తాసిల్దార్‌ మల్లికార్జున్‌, ఏటీడీవో, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


logo