గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 18, 2020 , 00:40:25

బందోబస్తు మధ్య విండో చైర్మన్‌ ఎన్నిక

 బందోబస్తు మధ్య  విండో చైర్మన్‌ ఎన్నిక

అమ్రాబాద్‌ : ఈ నెల 15న జరిగిన సింగిల్‌ విండో ఎన్నికల్లో  బాగంగా ఆదివారం జరుగాల్సిన అధ్యక్ష, ఉపాధ్యక్షుల  ఎన్నిక ఉద్రిక్తతకు దారి తీయడంతో తిరిగి సోమవారం బారీ బందోబస్తు మధ్య నిర్వహించిన ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థి గణేశ్‌ చైర్మన్‌గా వైస్‌ చైర్మన్‌గా మంగమ్మలు ఎన్నికయ్యారు. మొత్తం 13 మంది డైరెక్టర్లకు కాంగ్రెస్‌ బలపరచిన అభ్యర్థులు ఏడుగురు , టీఆర్‌ఎస్‌  నుంచి ఆరుగురు డైరెక్టర్లు గెలుపొందారు. ఉద్రితక్తలు చోటుచేసుకునే అవకాశాలు ఉండటంతో మండలకేంద్రంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. ఈ ఎన్నికకు  జిల్లా అదనపు కలెక్టర్‌ హన్మంతారెడ్డి, ఎస్పీ సాయిశేఖర్‌, ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 100మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియను జిల్లా డీసీవో శ్రీరాములు, ఎన్నికల అధికారి ఉదయం 9 గంటలకు ప్రారంభించారు. సాయంత్రం మూడున్నరకు ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ను ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించి గెలుపు పత్రాల్ని అందజేశారు.   కార్యక్రమంలో డీఎస్పీ నరసింహులు, సీఐ లు బీసన్న, రామకృష్ణ, ఎస్‌ఐలు పోచయ్య, బద్రినాథ్‌, సురేశ్‌లు పాల్గొన్నారు.


గన్యాగుల సొసైటీ ఎన్నిక

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : నాగర్‌కర్నూల్‌ మండలం గన్యాగుల గ్రామ సహకార సంఘం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్నిక జరగాల్సి ఉండగా ఒక డైరెక్టర్‌ ఆలస్యంగా రావడంతో ఎన్నికల అధికారి ఎంపికను వాయిదా వేశారు.   సోమవారం ఉదయం 9 గంటలకు విండో కార్యాలయానికి చేరుకున్న డైరెక్టర్ల ఓటింగ్‌లో చైర్మన్‌ ఎన్నిక నిర్వహించారు. వాస్తవానికి అన్ని డైరెక్టర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు కౌవసం చేసుకోగా, ఆలస్యంగా వచ్చిన కారణంగా సోమవారం ఎన్నిక నిర్వహించారు. దీంతో చైర్మన్‌గా కృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌గా పెద్దరాములు నామినేషన్లు వేయగా డైరెక్టర్లు అందరు కూడా ఓటింగ్‌లో పాల్గొనడంతో చైర్మన్‌గా కృష్ణయ్య, వైస్‌ చైర్మన్‌గా పెద్దరాములు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అనంతరం వారికి ధ్రువపత్రాలను అందజేశారు. 


విండో చైర్మన్‌ గా జూపల్లి భాస్కర్‌రావు వెల్డండ : మండలకేద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయంలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్‌గా భాస్కర్‌ రావు, వైస్‌ చైర్మన్‌గా  సంజీవ్‌ కుమార్‌ను ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. 


logo