బుధవారం 27 మే 2020
Nagarkurnool - Feb 16, 2020 , 00:27:58

పనితీరు మారకుంటే చర్యలు

పనితీరు మారకుంటే చర్యలు

నాగర్‌కర్నూల్‌ క్రైం: నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ దవాఖాన వైద్యులు, సిబ్బందిపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ చేతికి తీవ్ర గాయాలు కాగా ఎక్స్‌రే తీయకుండానే కట్టు కట్టిన విధానంపై ఎమ్మెల్యే దవాఖాన డాక్టర్లు, సిబ్బందిపై మండిపడ్డారు. దవాఖానకు  రోగులపై అంత చులకగా చూడడం ఏమిటని పశ్నించారు. పేద రోగులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బిజినేపల్లి మండలం లట్లుపల్లికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు భార్య పిల్లలతో కలిసి లట్టుపల్లికి మోటర్‌సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాసులు మృతి చెందగా, భార్య, పిల్లలు త్రీవ గాయాలతో దవాఖానలో చికిత్స  చేరారు. 


కాగా రాత్రి మృతదేహాన్ని పరిశీలించేందుకు దవాఖాన మార్చురీకి చేరుకున్న ఎమ్మెల్యే దవాఖానను తనిఖీ చేశారు. మృతుడి భార్యకు, కుమారుడికి ఫ్యాక్చర్‌ అయితే ఎక్స్‌రే తీయకుండానే కట్టు కట్టారు. దీంతో పరీక్షించిన ఎమ్మెల్యే డ్యూటీ డాక్టర్‌, సిబ్బందిపై మండిపడ్డారు. వైద్యం చేయలేని పరిస్థితి ఉంటే ఇతర దవాఖానకు రెఫర్‌ చేయాలే తప్పా ఇబ్బందులు పెట్టవద్దన్నారు. రెండు గంటలైనా ఎక్స్‌రే కూడా తీయకుండా కట్టు కట్టడం ఏమిటని సూపరింటెండెంట్‌ ప్రభును నిలదీశారు. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, ప్రభుత్వ దవాఖానకు పేద రోగులే వస్తారని, వారికి సరైన వైద్యం అందించడం డాక్టర్లుగా మీ బాధ్యత అన్నారు. భర్త చనిపోయి బాధలో ఉన్న మహిళ తీవ్రంగా గాయపడినా వైద్యం అందించకపోవడం ఏమిటని ఆగ్రహించారు. పనితీరులో మార్పు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. 


logo