శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 15, 2020 , 00:14:29

పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : పేదల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాలోని బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్‌ గ్రామానికి చెందిన పోశావులుకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60 వేల చె క్కును ఎమ్మెల్యే మర్రి బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సుదర్శన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శించిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్‌ క్రైం:  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బిజినేపల్లి మ ండలం మంగనూర్‌ గ్రామానికి చెందిన  జంగం శ్రీనివాసులు(23) కుటుంబాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి  పరామర్శించారు. శుక్రవారం దవాఖానలో మృతదేహాన్ని పరిశీలించారు. భార్య పిల్లలతో కలిసి బిజినేపల్లి నుంచి లట్టుపల్లికి వెళుతుండగా  మంగనూర్‌ శివారులోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంక్‌ ముందు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెం దినట్లు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దవాఖానని సం దర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.అనంతరం కు టుంబ సభ్యులకు తక్షణ ఆర్థిక స హా యం కింద రూ.15 వేలు అందజేశా రు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్‌లో  రేవల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు తిరుపతిరెడ్డి కుమారుడి రిసెప్షన్‌కు హాజరైన ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి వధూవరులను ఆశీర్వదించారు.  కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


logo