బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 15, 2020 , 00:14:29

తిమ్మాజిపేటలో సామాజిక తనిఖీ

 తిమ్మాజిపేటలో సామాజిక తనిఖీ

తిమ్మాజిపేట :  ఉపాధి సామాజిక తనిఖీలో భాగంగా  తిమ్మాజిపేట మండలకేంద్రంలోని ఈ జీఎస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావేదిక సుధీర్గంగా కొనసాగింది. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి దాదాపు 9 గంటల దాక సాగింది. ఏపీడీ గోవిందరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పనుల వివరాలను సామాజిక తనిఖీ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎస్‌ఆర్‌పీ నాగయ్య ఆధ్వర్యంలో వివరాలను బయట పెట్టారు. మండలంలో గత సంవత్సర కాలంగా జరిగిన రూ.3.80 కోట్ల పనుల వివరాలను బహిర్గంతం చేశారు. మస్టర్లలో తప్పులు, కోలతల్లో తేడాలను గుర్తించారు. మారేపల్లి గ్రామంలో పనుల్లో తేడాలను ఎక్కువగా గుర్తించి  రికవరీలు, జరిమానా విధించారు. హరితహారంలో నాటిన మొక్కలు పలు గ్రామాల్లో కనిపించలేదని తనిఖీ బృందం సభలో ప్రస్తావించారు. పోయిన మొక్కల స్థానంలో మళ్లి మొక్కలు నాటాలని అధికారులు ఆదేశించారు. పలు గ్రామాల్లోని  క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి రూ.12,342 రికవరీకి ఆదేశించారు. కోలతల్లో తప్పులు చేసినందుకు రూ.17 వేలు జరిమానా విధించినట్లు ఏపీడీ గోవిందరాజు తెలిపారు.  ప్రజావేదికలో  ప్రజలు పెద్దగా  కనిపించలేదు. ఉపాధి సిబ్బంది, తనిఖీ బృందం సభ్యులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, విజిలేన్స్‌ అధికారులు రుద్రమూర్తి, అరుణ, ఏకాబంరం, ఎంపీడీవో కరుణశ్రీ, ఏపీవో  నర్సింహలు,  సర్పంచ్‌ వేణుగొపాల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo