శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 14, 2020 , 01:16:27

పెబ్బేరు నంబర్‌ 1

పెబ్బేరు నంబర్‌ 1

పెబ్బేరు : ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులుపుకున్నాయి. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన జిల్లా దవాఖానతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కేసీఆర్‌ సర్కార్‌ అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దింది. పేదలకు మెరుగై న వైద్యం అందించడమే లక్ష్యంగా కార్పొరేట్‌ దవాఖానలకు దీటుగా అధునాతన సౌకర్యాలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య సేవల్లో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తు పేదలకు మెరుగైన వైద్యం అందిస్తు ంది. సర్కార్‌ దవాఖానలో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అం దుబాటులోకి రావడంతో పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సహజ కాన్పుల సంఖ్య మరింత పెరిగాయి. గతంతో పొలుస్తే సర్కార్‌ దవాఖానలో ప్రసవాలు చే యించుకునేందుకు గర్భిణులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానలో ప్రసూతి విభాగంలో వైద్య సేవలను అందిస్తున్నారు. గత ంలో ప్రభుత్వ దవాఖానలో ప్రసూతి అంటేనే భయంతో ఆమడ దూరం ఉండేవారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి, జిల్లా ఉన్నత అధికారులు జిల్లా ప్రభుత్వ దవాఖానతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపైన ప్రత్యేక చొరవ చూపడంతో పాటు ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ వంటి సంక్షేమ పథకం అందుబాటులోకి రావడంతో పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సహజ కాన్పుల సంఖ్య పెరిగింది.

జిల్లాలో మొదటి స్థానంలో..

జిల్లా వైద్యాధికారుల ఘనంకాల ప్రకారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవల్లో జిల్లాలో పెబ్బేరు మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఖిల్లాఘణపురం, మూడో స్థానంలో కొత్తకోట ఉంది. మండలంలోని వివిధ గ్రామాలలోని మహిళలు గర్భందాల్చినప్పటి నుంచి ఆశ కార్యకర్తలు ప్రతి నెల వారిగా క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చి వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు. గతంలో 2016-17 సంవత్సరం పెబ్బేరులో 199 ప్రసవాలు నమోదైనవి, ఖిల్లాఘణపురంలో 123, కొత్తకోటలో 156 ప్రసవాలు నమోదుకాగా, తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 2017 సంవత్సరంలో కేసీఆర్‌ కిట్‌, 102, వంటి పథకాలు అమలులోకి రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య 2020 జనవరి వరకు పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 834 ప్రసవాలు నమోదైనవి. ఖిల్లాఘణపురంలో 664, కొత్తకోటలో 652 సహజ కాస్పుల సంఖ్య పెరిగింది. అందులో భాగంగా పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకు పది చొప్పున ప్రసవాల సంఖ్య పెరగడంతో సంవత్సరానికి దాదాపుగా వందకు పైగా ప్రసవాల సంఖ్య పెరిగాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సహజకాన్పులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కష్టతరమైన ప్రసవాలను మాత్రమే జిల్లా వైద్యారోగ్య కేంద్రానికి 108 వాహనంలో తరలించి మెరుగైన వైద్యం నిర్వహించి 80 శాతం ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు జరిగే విధంగా పెబ్బేరు మండల ఆరోగ్య వైద్య సిబ్బంది వైద్యాన్ని నిర్వహిస్తున్నారు. logo