గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 14, 2020 , 01:15:14

పేదల సంక్షేమమే లక్ష్యం

పేదల సంక్షేమమే లక్ష్యం

గోపాల్‌పేట : పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన పెద్ద రాములుకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.49,500 ఆర్థిక సాయం చెక్కును గురువారం మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఆపదలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం పొందే పేదలను సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నదని తెలిపారు. కాగా, పెద్ద రాములుకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరుకు కృషి చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కావలి నాగరాజు, వార్డు సభ్యులు శ్రావణ్‌కుమార్‌, లచ్చగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శివకుమార్‌, శేఖర్‌గౌడ్‌, చంద్రశేఖర్‌రావు, సోడె వెంకటయ్య, సహదేవుడు, వెంకటేశ్‌, యాదయ్య, శ్రీనివాసులుగౌడ్‌, తిరుపతి, విజన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo