శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Feb 14, 2020 , 01:05:22

ఆడపిల్లలకు కరాటే అవసరం

ఆడపిల్లలకు కరాటే అవసరం

వనపర్తి వైద్యం : ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం కరాటే చాలా అవసరమని డాక్టర్‌ పైరెడ్డి పావని అన్నారు. గురువారం ఏబీవీపీ వనపర్తి నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక సరస్వతి శిశు మందిర్‌ పాఠశాలలో మిషన్‌ సహాసి 2020 ఆత్మరక్షణ విద్య కార్యక్రమంలో భాగంగా కరాటే ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పైరెడ్డి పావని పాల్గొని జ్యోతిప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో మహిళలను గౌరవించే దేశంగా భారతదేశానికి మంచి గుర్తింపు ఉందన్నారు. అలాంటి మన దేశంలో చిన్నారుల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు మహిళలపై దాడులు, హత్యాచారాలు ఆందోళన కల్గిస్తున్నాయని అన్నారు. ఇటువంటి సందర్భంలో ఎవరి సహయం కోసం ఎదురుచూడకుండా తమను తాము రక్షించుకోవడానికి ఏబీవీపీ విద్యార్థులు కరాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందించారు. ఈ కరాటేలో ఉత్తమ ప్రతిభ కనబచిన విద్యార్థులకు మెమోటోలు అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భరత్‌చంద్ర, శివలింగం, అజయ్‌, లక్ష్మి, యాదగిరి, పవన్‌, రాజు, ఖదర్‌, నవీన్‌, శివ, వంశీ, ఒంకార్‌ పాల్గొన్నారు.


logo