శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 14, 2020 , 01:04:20

తండా రోడ్లకు మహర్దశ

తండా రోడ్లకు మహర్దశ

ఖిల్లాఘణపురం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీటీ రోడ్లు లేని తండాలకు బీటీ రోడ్లు ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన్‌ పథకం కింద రూ.8.50కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో మామిడిమాడ తండా నుంచి బక్కతండా, మేడిబాయితండా, కర్నెతండా వరకు బీటీరోడ్డు నిర్మాణాలతో పాటు మధ్యలో కల్వర్టుల నిర్మాణాలను ఏర్పాటు చేయనున్నారు. గురువారం పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఈఈ వెంకటకృష్ణ, ఏఈ కబీర్‌దాస్‌, సర్పంచ్‌ రాజునాయక్‌లు సర్వే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 7 కిలో మీటర్ల పొడవున బీటీ రోడ్డు నిర్మాణం చేయనున్నామని తెలిపారు. అక్కడక్కడ చిన్న చిన్న కల్వర్టులు ఉన్నాయని వాటి సర్వేను పూర్తిచేసి వాటి స్థానంలో కొత్త కల్వర్టులను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పై అధికారులకు సర్వే రిపోర్ట్‌ను పంపిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo