గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Feb 14, 2020 , 00:31:16

మెడికల్‌ దుకాణాలపై ఆకస్మిక దాడులు

మెడికల్‌ దుకాణాలపై ఆకస్మిక దాడులు

 గద్వాల అర్బన్‌: మెడికల్‌ దుకాణదారులు తప్పనిసరిగా మెడికల్‌ నిబంధనలు పాటించాలని ఉమ్మడి జిల్లా ఔశదనియంత్రణ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజవర్ధన్‌చారి పేర్కొన్నారు. గురువారం రాజవర్ధన్‌చారి బృందంతోపాటు మరో రెండు బృందాలు వేర్వేరుగా విడిపోయి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్‌ దుకాణలపై  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంలో దుకాణలలో బిల్స్‌, షాంపుల్స్‌, ఫార్మసీ సర్టిఫికెట్‌ తదితర విషయాలనునిశితంగా పరిశీలించి వాటిపై దుకాణ దారులతో ఆరా తీశారు. బిల్స్‌ చూయించని దుకాణలలపై నోటిస్‌ జారీ చేశారు.ఈ సందర్భంగా రాజవర్ధన్‌చారి మాట్లాడుతు ప్రతి మెడికల్‌ దుకాణ నిర్వాహకుడు తప్పకుండా బిల్స్‌ ఇవ్వాలని సూచించారు.అలాగే ఎలాంటి ఔషధ నియంత్రణకు సంబంధించి షాంపుల్స్‌ మందులు ఉండకూడదని హెచ్చరించారు. తప్పనిసరిగా మెడికల్‌ దుకాణలలో ఫార్మసీతో పాటు మెడికల్‌ నియమ నిబంధనలు పాటించాలని మెడికల్‌ దుకాణ నిర్వాహకులకు హెచ్చరించారు.ఈ తనిఖీలో మహబుబ్‌నగర్‌ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి అరవింద్‌, జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి ఔషధ నియంత్రణ అధికారి శ్రీకాంత్‌  ఉన్నారు.


logo