గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 13, 2020 , 00:10:08

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: సహకార ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని అన్ని డైరెక్టర్‌ స్థానాలను గెలుపించుకునేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఎమ్మె  కూచకుళ్ల దామోదర్‌రెడ్డిలు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని 6 సొసైటీలకు గాను తిమ్మాజిపేట మండంలోని గొరిట సొసైటీలోని 13 డైరెక్టర్‌ స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా తెలకపల్లి మండలంలో  సొసైటీలో 4 డైరెక్టర్లు, తాడూరు మండల సొసైటీలో 1 డైరెక్టర్‌, బిజినేపల్లి సొసైటీలో 4 డైరెక్టర్లు, తాడూరు మండల సొసైటీలో 1 డైరెక్టర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గుర్తు చేశారు. వ్యవసాయ సహకార సంఘం ఏకగ్రీవం కావడం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన డైరెక్టర్లను, చైర్మన్లలకు త్వరలో నిజామాబాద్‌ జిల్లాలో సహకార సంఘాలను సందర్శించే విధంగా చూస్తామన్నారు.  సూచించిన డైరెక్టర్‌ అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


logo