గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 13, 2020 , 00:07:20

భౌరాపూర్‌ జాతర జయప్రదం చేద్దాం

భౌరాపూర్‌ జాతర జయప్రదం చేద్దాం

అమ్రాబాద్‌ రూరల్‌ : చెంచు పెంటల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో నేటి నుంచి ట్యాంకర్‌ ద్యారా తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు బుధవారం సూచించారు. ఈ నెల 20, 21 తేదీలో జరిగే భౌరాపూర్‌ జాతరను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చెంచుపెద్దలతో, చెంచు ప్రజాప్రతినిధులతో మండల పరిధిలోని మన్ననూర్‌ ఐటీడీఏ కార్యాలయంలో పీవో అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ నెల 14, 15న నాగర్‌కర్నూల జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే ప్రభుత్వం నుంచి జాతరకు రూ. 26లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. గతేడాదికంటే మరింతగా జాతరను విజయవంతం చేసేందుకు చెంచు పెద్దలు, సర్పంచ్‌లు మరింత చొరువ తీసుకోవాలని, ఎవరి వ్యక్తగతంగా కాకుండా సమష్టిగా ముందుకు వెళ్లాలన్నారు.  జాతరకు సంబంధించి పనివిభజనను వివిధ గ్రూపులుగా విభజన చేశామని వాటిని పర్యవేక్షించేందుకు సంబంధిత అధికారులను నియమించడం జరుగుతుందన్నారు. అధికారులు, నాయకులు, పెద్దలు, ఆశ్రమ, వసతి గృహల హెచ్‌ఎంలు ఇతరులతో అందరు కలిసి జాతరను సమష్టిగా విజయవంతం చేసేలా కృషిచేయాలన్నారు. చెంచులపెంటలలో శాశ్వత తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు ఇటీవల ప్రభుత్వ విప్‌, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషితో సుమారు రూ.6కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. కాని తాత్కాలిక ఇబ్బందులు తొలగించేలా తక్షణం రూ. 5లక్షల  నిధులు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు మంజూరు చేస్తామన్నారు. గురువారం నుంచే మేడిమల్కలా, లప్పాపూర్‌, భౌరాపూర్‌ పెంటలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలాని డీఈకి సూచించారు. జాతరకు సంబంధించిన పూజా సామగ్రి, దేవాలయం విద్యుత్‌ దీపాలతో అలంకరణ, భోజన ఏర్పా ట్లు, విద్యార్థులకు ఆటపాటలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ ఏర్పాటు, వీఐపీలకు ఆహ్వానం, కరపత్రాలు, పోస్టర్లు తదితర అంశాలతో మరింత ప్ర చారం చేయాలని సూచించారు. బతుకమ్మ, భ్రమరాంభికకు బోనం సమర్పణ చేసే విషయంలో మరింత దృష్టి కేంద్రకరించాలని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డీటీడీవో అఖిలేష్‌రెడ్డి, ఆర్డీవో పాండునాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ హేమలత, ఈజీఎస్‌ ప్రత్యేకాధికారి జయరాజు, ఐకేపీ ఏపీడీ లక్ష్మయ్య, ఐటీడీఏ ఈఈ శ్రీనువాసులు, బాల్‌రాం, సర్పంచ్‌లు పెద్దిరాజు, మల్లికార్జున్‌, ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు,  చెంచు పెద్దలు, రాములు, ఆలయ పూజారి గురువయ్య, శంకరయ్య పాల్గ్గొన్నారు.logo