మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Feb 13, 2020 , 00:01:26

వైభవంగా హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన

వైభవంగా హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీలోని సీతారామస్వామి దేవస్థానంలో బుధవారం ధ్వజస్తంభం వద్ద శ్రీరాములవారిని ఎదురుగా హనుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపన శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ విగ్రహానికి పలు పూజా కైంకర్యాలు నిర్వహించి యంత్ర ప్రతిష్ట శాస్ర్తోక్తంగా పూజలు చేసి అనంతరం భక్తిశ్రద్ధలతో హననుమాన్‌ విగ్రహ ప్రతిష్ఠాపనను వైభవంగా నిర్వహించారు. భగవంతుడు శ్రీరామునికి నిత్యపూజా భక్తుడైన హనుమంతుడు ఎదురుగా ఉ ం డడం భక్తులకు ధైర్యసాహసాలను క ల్పిస్తూ ఆరోగ్యంగా జీవించడానికి దేవుని కృప కటాక్షాలు భక్తులకు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉ దయం నుంచి హోమం, జపాలు, వివిధ కైంకర్యాలు నిర్వహించి స్వామివారి ప్రతిష్ట జరిపారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. హనుమాన్‌ వి గ్రహ దాత కాంతయ్య, వరలక్ష్మి దంపతు లను సన్మానించారు. అనంతరం ఆలయంలో సామూహిక భోజనాలు, అన్నప్రసాద పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిత్య విష్ణు స హస్త పారాయణ కమిటీ భక్తులు అర్చకులు చక్రవర్తి, శ్రీనివాసాచార్యులు, కరుణశ్రీ, కందాడై శ్రీనివాసాచార్యులు,సత్యసాయిభక్తులు, పారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


logo