గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 12, 2020 , 00:10:20

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

తిమ్మాజిపేట : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి నైపుణ్యాలు నేర్పించాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. మంగళవారం మండలంలోని గొరిట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల సామార్థ్యాలను పరీక్షించారు. ప్రతి పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు దాతల సాకారంతో డిక్షనరీలు అందించాలని సూచించారు. విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పది పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా పాఠాలు బోధించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనంను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకొని పదిలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. 

నైపుణ్యాలు నేర్పించాలి

బిజినేపల్లి : పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. మంగళవారం మండలంలోని వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు జరిగిన పరీక్షల ద్వారా తమ సామర్థ్యాలను అంచనా వేసుకోవాలన్నారు. కళలు కనడం, వాటిని సాకారం చేసుకోండని అబ్దుల్‌కలాం చెప్పిన విధంగా వాటిని సాకారం చేసుకోవాలంటే ముందుగా మనల్ని మనం ప్రశంసించుకోవాలన్నారు. వెళ్లే మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ కృషి, పట్టుదల అనే ఆయుధాలతో ఫలితాలు సాధించాలన్నారు. పది విద్యార్థుల సామార్థ్యాలు పరిశీలించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థుల సామార్థ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందింపజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. 


logo