శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 11, 2020 , 00:18:56

విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

కందనూలు : విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సూచించారు. సోమవారం  పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతిలు విద్యార్థులకు ఆల్బెండజోల్‌  మాత్రలను వేశారు. ఆ  సందర్భంగా వారు మాటాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే ఎంతటి విజయాలనైనా అవలీలగా సాధించవచ్చన్నారు. విద్యతో పాటు ఆరోగ్యంపై శ్రధ్ధ  చూపించాలన్నారు.  జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేశారు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్‌ మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేశారు. 19ఏళ్లలోపున్న  చిన్నారులు, విద్యార్థులకు ఆల్బెంజోల్‌ మాత్రలను వేశారు.  మండల వైద్యాధికారి డాక్టర్‌ దశరథం ఆధ్వర్యంలో జిల్లాలోని మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలలోని 668 మంది విద్యార్థినిలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. అనంతరం వారు విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను సూచించారు. చేతులు కడిగె విధానంలో ఉండె  కొత్త పద్దతులను విద్యార్థినులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రామకృష్ణ,వనిత, ఉమ, నరేశ్‌, ఆశ కార్యకర్తలు,  పాఠశాల ప్రిన్సిపాల్‌ స్నేహలత, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

బిజినేపల్లి మండలంలో.. 

బిజినేపల్లి : మండలంలోని గంగారం, లట్టుపల్లి, మంగనూరు, బిజినేపల్లి, కార్కొండ తదితర గ్రామాల్లో విద్యార్థులకు వైద్యసిబ్బంది నులి పురుగుల మాత్రలు వేశారు.  ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయ చివరి సంవత్సర విద్యార్థులు బిజినేపల్లిలోని విద్యార్థులకు నులి పురుగుల మాత్రల వేశారు. కార్యక్రమంలో వసంతలీల, యాదగిరి, నగేశ్‌, రామకృష్ణ, కృష్ణమ్మ, సలీం, బొజ్జమ్మ, గంగ, సతీశ్‌కుమార్‌, రాజారాంప్రకాశ్‌, శ్రీధర్‌, సుజాత, వసంత, జయమ్మ, శ్రీనివాసులు, కుమార్‌,అఖిల, రజిత, సంతోష పాల్గొన్నారు. 

 మాత్రల పంపిణీ 

తిమ్మాజిపేట : 19 ఏళ్ల లోపు పిల్లలకు జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం మండలంలోని వివిద పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు,బడిబయట పిల్లలకు మాత్రలను వేశారు. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలో మధ్యహ్న భోజనం అనంతరం మాత్రలను అందజేశారు.మండలంలోని మొత్తం 7089 మంది పిల్లలకు గాను సోమవారం 6325 మంది మాత్రలు వేసినట్లు వైద్యధికారి డా. మంజులావాణి తెలిపారు. మిగిలిన వారికి 17న మరో సారి వేయనున్నట్లు తెలిపారు.


logo