శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Feb 11, 2020 , 00:18:21

సహకార ఎన్నికలు సమర్థ్ధవంతంగా నిర్వర్తించాలి

సహకార ఎన్నికలు సమర్థ్ధవంతంగా నిర్వర్తించాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: సహకార సంఘాల ఎన్నికలను అధికారులు సమర్ధవంతంగా నిర్వర్తించాలని జిల్లా సహకార అధికారి శ్రీరామ్‌ సూచించారు. సహకార ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహించనున్న 300 మంది ప్రిసైడింగ్‌ అధికారులకు సోమవారం జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీరామ్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, రైతుల అభివృద్ధికోసం ఏర్పడిన ఈసంఘాలకు ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను జాగ్రతగా పరిశీలించి ఓటు హక్కును కల్పించాలన్నారు. 15వ తేదీన ఉదయం 7 గంటల నుండి ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఏజెంట్ల సమక్షంలో సమర్ధవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నినకలను కౌంటింగ్‌ను నిర్వహించే పూర్తి బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారులదే అన్నారు. 


logo