గురువారం 28 మే 2020
Nagarkurnool - Feb 11, 2020 , 00:15:46

సమిష్టిగా పని చేస్తే విజయం తథ్యం

సమిష్టిగా పని చేస్తే విజయం తథ్యం

లింగాల: మండలంలోని అంబట్‌పల్లి సింగిల్‌ విండోలో ఉన్న 13డైరెక్టర్‌ స్థా నాల ను టీఆర్‌ఎస్‌ మద్ధతుదారులు గెలుచుకోవాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గత ఎంపీటీసీ ఫలితాలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలని, అభ్యర్థుల గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను రైతులకు తెలియజేసి ప్రచారంలో ముందుకు పోవాలన్నారు. మండలంలో ఉన్న సింగిల్‌ విండో కార్యాలయాన్ని అంబట్‌పల్లికి తరలిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించా రు. టీఆర్‌ఎస్‌ మద్దతు దారుడు చైర్మన్‌ అయితే పీఏసీఎస్‌ను మరింత బలోపేతం చే యడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రానోజీ, సర్పంచ్‌ కోనేటి తిర్పతయ్య, ఎంపీటీసీ కేటీ తిర్పతయ్య, కాశీనాథం, వసుమతి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ కొండల్‌రావు, మాజీ జెడ్పీటీసీ  తిర్పతయ్య, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo