శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 10, 2020 , 00:47:08

1168 నామినేషన్లు ఆమోదం

1168 నామినేషన్లు ఆమోదంనాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :  ఎన్నికల నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ పూర్తయ్యింది. జిల్లాలోని 23విండోల పరిధిలోని 299డైరెక్టర్ల పదవులకు ఈనెల 15న ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం మూ  రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇందుకోసం 1179మంది నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల చివరి రోజైన శనివారం నాటికి కొల్లాపూర్‌ మండలం మాచినేనిపల్లిలో 7,8డైరెక్టర్ల పదవులు, కోడేరు మండలం కొండ్రావుపల్లి డైరెక్టర్‌ పదవి, పెంట్లవెల్లి విండోలోని ఏడో డైరెక్టర్‌ స్థానాల చొప్పున నాలుగు డైరెక్టర్ల పదవులు దాదాపు ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడ ఒక్కటే నామినేషన్‌ రావడంతో ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. అధికారులు ప్రకటించాల్సి ఉంది. కాగా ఆదివారం అధికారులు 1179నామినేషన్లను రిశీలించారు. ఇందులో 11నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు. ఈ కారణంగా మరో రెండు డైరెక్టర్‌ పదవులు ఏకగ్రీవం కావడం విశేషం. గొరిట, మాచినేనిపల్లిలో నామినేషన్లను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న కారణాలతో తిరస్కరించారు. దీంతో ఒకే నామినేషన్‌ దాఖలైనట్లుగా అధికారులు నిర్ధారించారు. ఫలితంగా ఆ రెండు పదవులూ ఏకగ్రీవం అయ్యాయి. దీనివల్ల మొత్తం 1168నామినేషన్లు సరిగ్గా ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. సోమవారం కీలకమైన ఉపసంహరణ ప్రక్రియ మిగిలి ఉంది. చాలా స్థానాల్లో విండో డైరెక్టర్‌, చైర్మన్‌ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగా శనివారం సాయంత్రం నుంచే అభ్యర్థులు ప్రత్యర్థులను బరిలో నుంచి తప్పించే మంతనాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఆయా పార్టీల ద్వారా తాము చేయిం  సహకారంపై భరోసా కల్పిస్తున్నారు. అలాగే ఆర్థికంగా  ప్రభావితం చేసే వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. దీని వల్ల సోమవారం రోజు పలు డైరెక్టర్లకు పెద్ద ఎత్తున ఉపసంహరణలు జరిగే అవకాశమున్నట్లుగా చర్చ జరుగుతుంది. మొత్తం 23విండోల పరిధిలోనూ ఇలా సహకార ఎన్నికల ప్రక్రియ గ్రామాలు, పట్టణాల్లో రాజకీయ వేడిని పెంచుతుంది. అధికార టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఎన్నికల్లో పోటాపోటీగా అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. కమలం పార్టీ మాత్రం నామమాత్రంగా మారుతుంది. ఇప్పటికే డైరెక్టర్ల వారీగా ఉన్న ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. తమకు గెలిపిస్తే ఎలాంటి లాభం కలుగుతుందోనని ఓటర్లకు నమ్మకం కల్పిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఉపసంహరణ పూర్తయ్యాక అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా స్వతంత్ర గుర్తులతో జరుగుతున్న ఈ ఎన్నికలు జిల్లాలో రసకందాయంగా మారా  అధికార టీఆర్‌ఎస్‌ ఇటీవలి వరుస ఎన్నికల విజయంతో సాధించిన తన పట్టుని నిలబెట్టుకునేందుకు రైతుబలంతో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లోనైనా పట్టు నిలుపుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. సోమవారం సాయంత్రం గుర్తులు వచ్చాక అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తారు. ప్రచారానికి మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. దీనివల్ల డైరెక్టర్ల పదవులను గెలిపించుకునే బాధ్యత ఆయా పార్టీల ముఖ్య నా  విండో చైర్మన్‌ అభ్యర్థులకు అప్పగించనున్నారు. మొత్తం మీద జిల్లాలో సహకార సంఘ ఎన్నికలు కీలక దశకు చేరుకొన్నాయి.


logo