సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Feb 10, 2020 , 00:45:26

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

అమ్రాబాద్‌ రూరల్‌ : ఏటీఆర్‌ అటవీ ప్రాంతంలో కొన్ని రోజులుగా మానవాలి తప్పిదం వల్లనే పలుమార్లు కార్చిచ్చు సంఘటన విధితమే. ఈ నేపథ్యంలో మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ ఉన్నతాధికారులు రెండు ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. బృందాల పనితీరు ఏవిధంగా ఉన్నది, హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారివెంట నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తున్నదని ఆదివారం అటవీశాఖ జిల్లా అధికారి జోజి పలు గ్రామాల్లో పర్యటించారు. మండలంలోని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచింతలబైలు గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ అటవికి నిప్పు.. మానవాలికి ముప్పు అని అడవులను సంరక్షించుకునే బాధ్యత ప్రతిఒక్కరిదని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాలచేత అడవుల్లో ప్రమాదాలు చోటచేసుకుంటున్నాయని, ఈ క్రమంలో యాత్రికులు యాత్రలు చేసేటప్పుడు అటవి మార్గంలో అగ్గిని రాజేయరాదని, ఇలాంటి సన్నివేశాలు ఎక్కడ కనిపించినా చట్టపరమైన చర్యలతోపాటు పెద్దమొత్తంలో జరిమానా వేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అటవీ సమీప గ్రామాల రైతులు, పశువుల కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ బీడి, సిగరేట్‌ ముట్టించరాదని, ఎవరివద్ద అగ్గిపెట్టలు ఉంచుకోవద్దని సూచించారు. అగ్గినివారణ చేయుటలో భాగంగా ఏర్పడిన రెస్క్యూ టీం నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ నిర్లక్షంగా ఉండకుండా నిత్యం పెట్రోలింగ్‌ చేస్తూనే ఉండాలని, సంబంధిత ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తామన్నారు. కార్యక్రమంలో దోమలపెంట అటవీక్షేత్ర అధికారి రవిమోహన్‌ భట్‌, రివర్‌పార్టీ శివ, మరో పది రెస్క్యూ టీం సభ్యులు ఉన్నారు.


logo