మర్డర్, దశావతారం, హిస్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది హర్యానా సుందరి మల్లికాషెరావత్. ఓ వైపు హీరోయిన్గా, ఐటెంభామగా తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. 2016లో వచ్చిన డర్టీ పాలిటిక్స్ తో చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన ఈ భామ ఆ తర్వాత మరే చిత్రంలో కనిపించలేదు. కొంతకాలంగా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ను షేర్ చేసుకుంటుంది మల్లికాషెరావత్.
ట్రెండీ లుక్‌లోనైనా, సంప్రదాయక వస్త్రధారణలో అయినా తనకు తానే సాటి అని చెప్తుందీ బాలీవుడ్ హాట్ తార. తాజాగా మల్లికాషెరావత్ చీరకట్టులో హొయలు పోతూ కెమెరాకు పోజులిచ్చింది. జాలువారుతున్నట్టుగా ఉన్న కురులతో చీరకట్టులో డిఫరెంట్ షేడ్స్ లో ఫొటోషూట్‌లో పాల్గొన్నది. మల్లికాషెరావత్ వయ్యారాలు ఒలకబోస్తూ ఉన్న నయా ప్రెష్ లుక్ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.