బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 10, 2020 , 00:43:07

కబడ్డీలో గుర్తింపు తెచ్చుకోవాలి

కబడ్డీలో గుర్తింపు తెచ్చుకోవాలి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : కబడ్డీలో గ్రామీణ విద్యార్థులు  ప్రతిభ కనబర్చి గుర్తింపు తెచ్చుకోవాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీచైర్మన్‌ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని సీనియర్‌ మహిళలు, పురుషుల జట్లను ఎంపిక చేసేందుకు స్థానిక జూనియర్‌ కళాశాల ఆవరణలో పోటీలు నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ  చైర్మన్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. ఉదయం ప్రారంభమైన ఎంపికలు మధ్యాహ్నం పూర్తయ్యాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 67 మంది పురుషులు, 54 మంది మహిళా విద్యార్థులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కబడ్డీలో  ప్రతిభ కనబర్చిన మహిళల జట్టుకు 12 మందిని, పురుషుల జట్టుకు 12 మంది చొప్పున టీమ్‌లను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 20వ తేదీ వ రకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇ ల్లెందులలో 67వ సీనియర్‌ కబడ్డీ అం తర్‌ జిల్లాల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పా ల్గొంటారని తెలిపారు.  కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కల్పనాభాస్కర్‌గౌడ్‌, ధ్యాన్‌చంద్‌ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు జక్కా రాజ్‌కుమార్‌రెడ్డి, విజయ, నరేందర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కురుమూర్తి, కబడ్డీ అసోసియేన్‌ ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్‌, ఊర్కొండ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గిరినాయక్‌, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌, నర్సింహరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కోశాధికారి సీతారాం, ఉపాధ్యక్షుడు శ్యామ్‌, కార్యవర్గ సభ్యులు రామన్‌గౌడ్‌, వరలక్ష్మి, కుమారస్వామి, వీరప్ప, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.logo