ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 08, 2020 , 00:48:15

పాలమూరులో క్రీడా సౌరభం

పాలమూరులో క్రీడా సౌరభం

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం  అన్ని విధాలా కృషి చేస్తున్నదని జిల్లా జెడ్పీ చైర్మన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  రాజేశ్వర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్‌ -17 బాల బాలికల సింగిల్స్‌, డబుల్స్‌ టెన్నికాయిట్‌ టోర్నీని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, చదువుతోపాటు క్రీడలు ముఖ్యమన్నారు. క్రీడాంశాల్లో రాణించిన వారు చదువులో కూడా చురుకుగా రాణిస్తారన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రా    10 జిల్లాల నుంచి మహబూబ్‌ నగర్‌ రాష్ట్ర స్థాయి టోర్నీకి రావడం సంతోషంగా ఉందన్నారు. 

మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, క్రీడా శాఖ మంత్రిగా ఉండడం అదృష్టమని, భవిష్యత్తులో మరింత క్రీడాభివృద్ధి జరుగు తుందన్నారు. క్రీడాభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తారని తెలిపారు. క్రీడల్లో అన్ని జట్లు గెలువవని, ఎవరో ఒకరు గెలుస్తారని, ఓటమితో మన తప్పులు తెలుసుకొని గెలుపుకోసం కృషి చేయాలన్నారు. డీఈవో ఉషారాణి మాట్లాడుతూ ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహిస్తు న్నామని తెలిపారు. మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయడంలో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర  ఎంతో ఉందన్నారు. పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వం ఫిట్‌ ఇండియా కార్య క్రమాన్ని అమలు చేస్తున్నదని, ఆరోగ్యంగా ఉంటేనే ఫిట్‌ ఇండియా సాధిస్తామన్నారు. అనంతరం క్రీడా జెండాను ఆవిష్కరించి క్రీడా పోటీలను ప్రారంభించారు. టోర్నీలో మొత్తం 10 జిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు పాలు పంచుకున్నారు.  ఈ కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ గోటూరు శ్రీనివాసులుగౌడ్‌, కౌన్సిలర్‌ పుష్పవతి, జెడ్పీ కో-ఆప్షన్‌ మెంబర్‌ అన్వర్‌, వ్యాయామ ఉపాధ్యాయులు జగన్మోహన్‌ గౌడ్‌, దూమర్ల నిరంజన్‌, వేణుగోపాల్‌,  రిటైర్డ్‌ పీడీ చెన్నవీరయ్య, పీఈటీ  రమణ, రాఘవేందర్‌, నాగరాజు, సత్యనారాయ  రాజవర్దన్‌రెడ్డి, ఉమ, అరుణజ్యోతి పాల్గొన్నారు.

మున్సిపల్‌ ఛైర్మన్‌కు సన్మానం

మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, కౌన్సిలర్లు పుష్పవతి, చెన్నవీరయ్యను జెడ్పీ చైర్‌పర్సన్‌ తదితరులు సన్మానించారు. 

శుభారంభం చేసిన ఖమ్మం

జిల్లా పరిషత్‌ మైదానంలో జరుగుతున్న రాష్ట్ర స్థా  ఎస్‌జీఎఫ్‌ అండర్‌ -17 బాల బాలికల టెన్నికాయిట్‌ టోర్నీలో ఖమ్మం జట్టు శుభారంభం చేసింది. బాలికల విభాగంలో ఖమ్మం జట్టు హైదరాబాద్‌పై 2-0, 

అదిలాబాద్‌ జట్టు నిజామాబాద్‌ జట్టుపై 2-0 స్కోర్‌ తేడాతో గెలిచింది. బాలుర విభాగంలో ఖమ్మం జట్టు 

రంగారెడ్డిపై 2-1, అదిలాబాద్‌ జట్టు హైదరాబాద్‌ 2-0 స్కోర్‌ తేడాతో విజయం సాధించాయి. 


logo