బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 08, 2020 , 00:47:14

పశు సంపదను కాపాడుకోవాలి

పశు సంపదను కాపాడుకోవాలి

తెలకపల్లి : పశుసంపదను కాపాడుకోవాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి పశు సంపదే మూల కారణమని నాగర్‌కర్నూల్‌ జెడ్పీచైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి అన్నారు. మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో శుక్రవారం బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రథ  ఉత్సవాల సందర్భంగా బుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బండలాగుడు పోటీలను ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాంతం మొదటి నుంచి వ్యవసాయ రంగ ఆధారిత ప్రాంతంగా ఉందని తెలిపారు. స్వయంబుగా వెలిసిన బుగ్గ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు ప్రతి రథసప్తమికి జరగడం అనాధిగా వస్తున్నటువంటి ఆచారమని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా కబడ్డీ, బండలాగుడు పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. గత సమైక్య పాలనలో ఈ ప్రాంతం కరువు, కాటకాలతో అలమటించేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చొరవతో కృష్ణాజలాలను కేఎల్‌ఐ ద్వారా తరలించి సాగునీటిని అందించడం జరిగిందన్నారు.  రంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం  సర్పంచ్‌ అనసూయమ్మ, ఉపసర్పంచ్‌ జయరాం, టీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌లు పాల్గొన్నారు. 

logo