శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 08, 2020 , 00:47:14

రెండోరోజు 389

రెండోరోజు 389

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకొంది. దీంతో రెండో రోజైన శుక్రవారం భారీగా నామినేషన్లు వచ్చాయి. ఈ ఒక్క రోజే 389   దాఖలయ్యాయి. కాహగా చివరి రోజైన శనివారం అంతకంటే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా రెండు రోజుల పాటు కలిపి 23విండోలకు 486నామినేషన్లు దాఖలవ్వడం విశేషం.

నేడు నామినేషన్లకు తుది గడువు

నాగర్‌కర్నూల్‌లో సహకార ఎన్నికల ప్రక్రియ వేడెక్కింది. నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగియనుంది. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కాగా తొలి రోజు కేవలం 97నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో రోజైన శుక్రవారం భారీ సంఖ్యలో దాఖలవ్వడం గమనార్హం. ఈ ఒక్క రోజే ఏకంగా 389నామినేషన్లు వచ్చాయి. తొలి రోజుతో కలిపి రెండు రోజుల్లో 23విండోల పరిధిలోని 299డైరెక్టర్ల పదవులకు గాను 486నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం చివరి రోజు కావడంతో ఇదే స్థాయిలో నామినేషన్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలే చివరివి కావడంతో ఇప్ప  వరకూ పదవులు పొందని, ఇతర ఎన్నికల్లో టిక్కెట్లు రాని గ్రామ, మండల స్థాయి రాజకీయ నాయకులు సింగిల్‌ విండో ఛైర్మన్ల పదవులను ఆశిస్తున్నారు. ఫలితంగా చైర్మన్‌ పదవుల ఆశావహులు సొంతంగా డైరెక్టర్లను గెలిపించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు.  ఇక శనివారం నామినేషన్ల స్వీకరణ ముగియనుండగా 10వ తేదీ సోమవారంతో ఉపసంహరణ ముగుస్తుంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి. అందుకే అదే రోజు సాయంత్రం పోటీ చేసే డైరెక్టర్ల అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. అనంతరం మూడు రోజుల పాటు మాత్ర  ప్రచారం చేసుకునే వీలుంటుంది. చివరగా ఈనెల 15వ తేదీన పోలింగ్‌ ఉంటుంది. ఈ ఎన్నికలను విజయవంతం చేసేందుకు కలెక్టర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలోని ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే తమ పట్టు నిలుపుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ఎప్పటిలాగే దూసుకుపోతుండగా కనీసం ఈ ఎన్నికల్లోనైనా ఉనికిని చాటుకోవాలనే ఆరాటంలో కాంగ్రెస్‌, కమలం పార్టీల నాయకులు ఉబలాటపడుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి సహకార ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసేలా పార్టీలు వేస్తున్న ఎత్తులతో గ్రామాల్లో రాజకీయ వేడి రగులుకొంది. మొత్తం మీద చివరివైన సహకార ఎన్నికలు రాజకీయ నాయకులు, ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.


logo