ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Feb 08, 2020 , 00:31:28

ఇంటర్‌ పరీక్షలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు

ఇంటర్‌ పరీక్షలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు

కందనూలు:  04 నుంచి జరిగే ఇంటర్‌ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లకు తావ్వివొద్దని రాష్ట్ర విద్యాశాఖాధికారి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ళెకవారం వారు జిల్లా కలెక్టర్‌,  అధికారులతో వీసీ సమావేశ కార్యక్రమం నిర్వహించి వారితో మాట్లాడారు.  అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్‌ పరీక్షలను సజావుగా నిర్వహించాలని,  కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూడాలని,  రాసే సమయంలో కరెంట్‌ కోత తదితర లోపాలు లేకుండా సరి చూసుకోవాలని వారు అధికారులకు ఆదేశించారు.  పరీక్షలతో సంబంధం ఉన్న అధికారులందరూ కూడా ఇంటర్‌ అధికారులతో సమన్వయం లోపించకుండా విధులు నిర్వహించాలని,  విద్యార్థులకు పరీక్షలపై అనుమానాలు రేకెత్తించే విధంగా చర్యలు ఉండవద్దని హితవు పలికారు.  బోర్డు ద్వారా పంపించే చెక్‌ లిస్టు ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసి ఈ నెల 15 లోగా బోర్డుకు పంపించాలని కోరారు.పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని,  కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి విద్యార్థులు కోరిన సమాచారం ఇవ్వాలని,  రూటు మ్యాప్‌ను తయారు చేసి అందరికి అందుబాటులో ఉంచాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ  ఇంటర్‌ పరీక్ష నిర్వహనకు చేపట్టిన విషయాలను రాష్ట్ర విద్యాశాఖాధికారికి తెలపారు.  మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారని,  పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రశ్న,  పత్రాలు భద్రపరిచేందుకు 11 పోలిస్‌ స్టేషన్లు గుర్తించామని,  ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.ఈ కార్యక్రమంలో డీఐఈవో  రమణ,  మోహన్‌ రెడ్డి,  గోవిందరాజలు,  వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


logo