శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 07, 2020 , 00:35:32

సహకార ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

సహకార ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

తిమ్మాజిపేట : ఈ నెలలో జరుగనున్న ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌) టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులే ఓటర్లుగా ఉండే ఈ సంఘాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో నాయకులంతా సమన్వయంగా పని చేయాలన్నారు. కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. మరోసారి విండోలో గులాబి జెండాలు ఎగరాలన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్‌రెడ్డి, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు స్వామి, రఘుమారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. 


తెలంగాణ రాష్ట్రంలోనే ఆడపిల్లలకు గౌరవం 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే ఆడపిల్లలకు గౌరవం లభిస్తుందని, ఆడ బిడ్డ ఉన్న కుటుంబం గౌరవంగా జీవిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌ పథకం కింద మంజూరైన డబ్బులను ఎమ్మెల్యే మర్రి  చెక్కుల రూపంలో అందజేశారు. నాగర్‌కర్నూల్‌ మండలానికి చెందిన 48 మంది లబ్ధిదారులు, తాడూరు మండలానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.  కార్యక్రమంలో ఆర్డీవో నాగలక్ష్మి, తాసిల్దార్లు, జెడ్పీటీసీ శ్రీశైలం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ఎంపీపీలు, స్థానిక కౌన్సిలర్లు, ఆయా మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యేచే పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ 

ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేశారు. ఈ  క్యాంపు కార్యాలయం వద్ద ట్రాక్టర్ల పూజలు నిర్వహించి ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్‌ నడిపారు. అనంతరం వాటి తాళం చేతుల  పంచాయతీల సర్పంచ్‌లకు అందజేశారు. తా  మండలంలోని గోవిందాయపల్లి, తెలకపల్లి మండలంలోని జమిస్తాపూర్‌, గౌరెడ్డిపల్లి గ్రామ పంచాయతీల ట్రాక్టర్లను ఎమ్మెల్యే మర్రి పంపిణీ చేశారు. ఈ  ప్రజాప్రతినిధులు,  నాయకులు పాల్గొన్నారు.


మొబైల్‌ సర్వీస్‌సెంటర్‌ ప్రారంభం

పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని వక్ఫ్‌కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్‌ సర్వీస్‌సెంటర్‌ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. వ్యాపారంలో మంచి లాభాలు గడించాలని యజమానికి సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భాస్కర్‌రావు, విజయమ్మ పాల్గొన్నారు. 


కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

బిజినేపల్లి : పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి వరంలాంటిదని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంజేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో 42 మందికి కల్యాణలక్ష్మి, షాది ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రైతుల పొలాలకు నీరందించాలనే ఉద్దేశంతో మండలంలోని మమ్మాయిపల్లి గ్రామ సమీపంలో నిర్మించనున్న మార్కాండేయ రిజర్వాయర్‌ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.  మార్కాండేయ రిజర్వాయర్‌ పూర్తయితే ఆరు గ్రామాలు, 15 తండాలు, ఐదువేల ఎకరాలకు సాగునీరందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీటీసీ హరిచరణ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటస్వామి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కుర్మయ్య, వైస్‌ ఎంపీపీ చిన్నారెడ్డి, సర్పంచ్‌ బాలీశ్వర్‌, రెవెన్యూ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు ఉన్నారు.


logo