శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 06, 2020 , 03:07:26

నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్‌ కేసులు

నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్‌ కేసులు
  • 18మంది సిబ్బందికి.. ముగ్గురే హాజరు
  • త్వరలో బయోమెట్రిక్‌ అమలుకు ఆదేశాలు
  • వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్‌
  • ఉదయం జిల్లా దవాఖాన ఆకస్మిక తనిఖీ
  • ఆశ్చర్యపోయిన కలెక్టర్‌ శ్రీధర్‌


నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ ప్రభు  దవాఖానను బుధవారం కలెక్టర్‌ శ్రీధర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో దవాఖానకు చేరుకున్న కలెక్టర్‌ శ్రీధర్‌ మొదటగా డాక్టర్ల హాజరుపై ఆరా తీశారు. హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ముగ్గురు డాక్టర్ల సంతకాలు మాత్రమే ఉండడంతో కలెక్టర్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభుపై ఆగహ్రం వ్యక్తం చేశారు. అనంతరం  అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.  దీంతో అన్ని రిజిస్టర్లను తనిఖీ చేసిన సమాయానికి హాజరు కాని 15 మంది డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఒకరోజు జీతంలో కోత విధిస్తూ ఆదేశించారు. సమయపాలన పాటించిన డాక్టర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


డాక్టర్లు విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉందన్నారు. 18 మంది డాక్టర్లు విధులు నిర్వహించాల్సి ఉండగా, సందర్శించిన సమయంలో ముగ్గురు డాక్టర్లతోనే ఓపీని ఎలా నిర్వహిస్తారని, మీ పనితనం ఇదేలా అని కలెక్టర్‌ సూపరింటెండెంట్‌పై ఆగ్రహించారు. ఇది  బయోమెట్రిక్‌ సిస్టం ఉన్నప్పటికీ ఎందుకు అమలు పరచడం లేదని ప్రశ్నించారు. వెంటనే బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు పరుస్తూ కలెక్టరేట్‌కు అనుసంధానం చేయాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ ద్వారానే సిబ్బంది నెల జీతాలు చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.  బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నమోదు చేయాలని నిమిషం ఆలస్యమైన గైర్హాజర్‌ కిందికే పరిగణించాలని విధులకు హాజరైన సమయం నుంచి  విరమించే సమయం వరకు గరిష్టంగా 6 గంటల సమయానికి నిమిషం వత్యానం ఉన్నా గైర్హాజరు కిందకే పరిగణిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు.  దవాఖాన  రెండు గంటల్లో వివరణ అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 


దవాఖాన పనితీరుపై ఫిర్యాదులు..

జిల్లా దవాఖానలో పనితీరుపై తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తనలో మార్పు లేదని కలెక్టర్‌ సూపరింటెండెంట్‌పై ఆగ్రహించారు. పనితీరులో మార్పు రాకుంటే చర్యలతోపాటు క్రిమినల్‌ కేసు  నమోదు చేస్తామని  సిబ్బందిని హెచ్చరించారు. 


విష జ్వరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి..

విష జ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సమయంలో వైద్యుల పనితీరు తలమానికంలాంటిదని రోగులకు వైద్య సేవలందించి ప్రభు  దవాఖాన పట్ల ప్రజలకు అత్యంత విశ్వాసాన్ని కలిగించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రస్తుత సీజనల్‌ వ్యాధుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు దవాఖానల్లో సా  సమయంలో కూడా వైద్య సేవలందించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన దవాఖానలో వార్డులను, ల్యాబ్‌లను పరిశీలించారు. దవాఖానలో వైద్య పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న చికిత్సల గురించి వైద్యలను అడిగి తలుసుకున్నా  కలెక్టర్‌తోపాటు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభు, వైద్యులు, హెడ్‌నర్సులు ఉన్నారు.


logo