శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 06, 2020 , 03:05:53

గోవింద గోవింద

గోవింద గోవింద
  • పాలమూరులో మార్మోగిన గోవింద నామస్మరణ
  • పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • ఘనంగా లక్ష్మీ వెంకన్న ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
  • వైభవంగా మన్యంకొండ వెంకన్న గ్రామోత్సవం

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. లక్ష్మీదేవి సహిత వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహాలకు జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సన్నాయి వాయిద్యాలు, అశేష భక్త జనవాళి మధ్య స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణతో పాలమూరు పు లకించిపోయింది. స్వామి వారికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సతీమణి శారద ప్రత్యేక పూజ లు నిర్వహించిన అనంతరం పట్టువస్ర్తాలు సమర్పించారు. స్వామివారి ర థోత్సవం సందర్భంగా భజనలు, కోలాటాలు, అడుగుల భజనలతో మార్మోగింది. 


అడుగడుగునా పటాకులు కాలుస్తూ రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. న్యూటౌన్‌, కొత్త బ స్టాండ్‌, రాంమందిర్‌ చౌరస్తా, వన్‌టౌన్‌, బండమీదిపల్లి మీదుగా మన్యంకొండకు స్వామివారి రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తాటి గణేశ్‌,  మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, నాయకులు మల్లు న ర్సింహారెడ్డి, రాఘవేంద్రగౌడ్‌, కౌ న్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, రమాదేవి, గోవిందు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్‌, దేవేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, శ్రీ నివాస్‌, రవీందర్‌రెడ్డి, రాధిక పాల్గొన్నారు. 


logo