మంగళవారం 02 జూన్ 2020
Nagarkurnool - Feb 06, 2020 , 03:04:55

మొక్కల పెంపకం పనులు పూర్తి చేయాలి:కలెక్టర్‌

మొక్కల పెంపకం పనులు పూర్తి చేయాలి:కలెక్టర్‌

కందనూలు: నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు రేపటితో పూర్తి చేయాలని, పురోగతి సాధించని ఎంపీడీవోలు, అధికారులపై చర్యలు తప్పవని  కలెక్టర్‌ శ్రీధర్‌ హెచ్చరించారు. గ్రామాల్లో నర్సరీలు, వైకుంఠ ధామాలు, డంపింగ్‌యార్డులు, ఇంకుడు గుంతల పురోగతిపై బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ మండలాల ఎంపీడీవోలు, నర్సరీలతో బ్యాగ్‌ ఫీలింగ్‌ పనులు రేపటితో పూర్తిచేసి జూన్‌ నాటికి హరితహారంలో మొక్కలను నాటే విధంగా చూడాలని కలెక్టర్‌ మండల అధికారులను ఆదేశించారు. మండలాల్లో జరుగుతున్న నర్సరీ పనులను పరిశీలించాలన్నారు.  జూన్‌మాసం నాటికి నాటడానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. వైకుంఠ ధామం, డంపింగ్‌ యార్డు, ట్రాక్టర్ల కొనుగోలు, ఇంకుడు గుంతలపై మండలాల వారీగా సమీక్షించారు. పురోగతిలో వెనుకబడిన మండలాల అధికారులు పురోగతి సాధించకుంటే ఎంపీడీవోలుగా కొనసాగాలని కలెక్టర్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 


 ప్రగతి పురోగతిపై 11వ తేదీన జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని, పురోగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో సుధాకర్‌, డీపీవో సురేశ్‌మోహన్‌, సీఈవో నాగమణి తదితరులు పాల్గొన్నారు.


logo