శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 05, 2020 , 00:17:53

అమ్రాబాద్‌ లిఫ్ట్‌ ప్రతిపాదనలు సిద్ధం

అమ్రాబాద్‌ లిఫ్ట్‌ ప్రతిపాదనలు సిద్ధం

అచ్చంపేట రూరల్‌: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీడు భూములన్ని పచ్చబడుతున్నాయి. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్‌ చోరవతో ప్రతి సెంటు, గుంటకు సాగునీరందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దేశానికి ఆదర్శంగా నిలిచిన కాలేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి పరుగులు పెడుతుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గత 50 ఏండ్ల క్రితం నాటి రైతుల సాగునీటి కళ మరికొద్ది రోజులలో సాకారం కానుందని అచ్చంపేట నియోజకవర్గ ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న కెఎల్‌ఐ పనులను పూర్తి చేసి నీటి విడుదలకు శ్రీకారం చుట్టింది.   చారకొండ, అమ్రాబాద్‌, పదర మండలల్లోని ప్రతి సెంటు గుంటకు సాగు నీరందించి భీడు భూములన్నీ సస్య శ్యామలం చేయాలని బావించిన కేసీఆర్‌ ప్రభుత్వం అందుకు చేపట్టాల్సిన పనులు, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందానికి సూచించింది. 


అదే  ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్‌లోని విప్‌ కార్యాల  భారీ నీటి పారుదల శాఖ అధి  సంబంధిత ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నియోజ  చివరి ఆయకట్టు వరకు సాగు  విధంగా చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు చేశారు. అచ్చంపేట నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో నీరందించేందుకు డిండి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా అమ్రాబాద్‌ ఎత్తి  పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు రిటైర్డ్‌ ఇంజనీర్ల బృంధం ఇటీవల సీఎం కేసీఆర్‌ కు నివేధి  అందజేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి ఏదుల రిజర్వాయర్‌ నింపి గ్రావిటి పైప్‌లైన్‌ ద్వారా లింగాల మండలం జినుగుపల్లి పంప్‌హౌస్‌ కు 2 పంపుల ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా ప్రతి  జినుగుపల్లి పంప్‌హౌస్‌ నుంచి  2.57 టీఎంసీల నీటిని బల్మూర్‌ మండల  మైలారం సమీ  నిర్మించ  రిజర్వాయర్‌ కు తరలిస్తారు. దీంతో బల్మూర్‌, అచ్చంపేట, లింగాల, ఉప్పునుంతల మండలాల పరిధిలో సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. మైలారం రిజర్వాయర్‌ నుండి చంద్ర  ద్వారా చంద్రసాగర్‌లో 0.300  నీటిని నింపి అక్కడ మరో లిఫ్ట్‌ ఏర్పాటు చేసి మన్ననూర్‌ రిజర్వాయర్‌ కు 1.410 టీఎంసీల నీటిని తరలించనున్నారు. 


దీంతో అమ్రా  పదర మండలాల్లో మరో 25 వేల ఎకరాలకు నీటిని అందించనున్నారు.  అచ్చంపేట నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో మొత్తం 75 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు కు సాగునీటి సాధనే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నారు. నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో రిజర్వాయర్‌ల నిర్మాణం కై వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో కావాల్సిన నిధులను కేటాయించి సాగునీటితో సస్య శ్యామలం చేయాలని రైతులు కోరుతున్నారు.


logo