శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 05, 2020 , 00:15:51

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: క్రీడలు విద్యార్థిని, విద్యార్థులకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్‌ప్రకాశ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బీసీ కళాశాలల విద్యారిని, విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ  కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, పరుగుపందెం, స్కిప్పింగ్‌ పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలలకు చెందిన 20 టీమ్‌లు పాల్గొనగా క్రీడాకారులను అనిల్‌ప్రకాశ్‌ పరిచయం చేసుకొని ప్రారంభించారు. అనంతరం గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు షీల్డ్‌లు, బహుమతులు అందజేశారు. 


విజేతలు వీరే...

జిల్లాలోని బీసీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో కబడ్డీ బాలుర జట్టులో విన్నర్‌గా కొండనాగుల, రన్నర్‌గా కోడేరు విద్యార్థులు గెలుపొందారు. అదేవిధంగా బాలుర బాలీబాల్‌లో విన్నర్‌గా పదర బీ.సీ ప్రభుత్వ బాలుర పాఠశాల, రన్నర్‌గా కొండనాగుల, కబడ్డీ బాలికల విభాగంలో విన్నర్‌గా బీ.సీ బాలికల కళాశాల నాగర్‌కర్నూల్‌, రన్నర్‌గా బల్మూర్‌, ఖోఖో బాలికల విభాగంలో ప్రభు  బాలికల కళాశాల బల్మూర్‌, రన్నర్‌గా తాడూరు ప్రభుత్వ కళాశాల విద్యార్థులు గెలుపొందారు. అదేవిధంగా పరుగుపందెం బాలు  విభాగంలో కొండనాగులకు చెందిన పవన్‌కల్యాణ్‌, భానుప్రసాద్‌, ప్రవీన్‌లు ప్రథమ,  తృతీయ విభాగంలో నిలిచారు. ఇం  స్కిప్పింగ్‌లో బల్మూర్‌కు చెందిన ఉమ, మౌ  తాడూరుకు చెందిన నవ్య, పరుగుపందెం బాలికల విభాగంలో బల్మూర్‌కు చెందిన లక్ష్మి, ఉమ, తాడూరుకు చెందిన గీతలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. 


logo