శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 23:25:23

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం

బిజినేపల్లి /తిమ్మాజిపేట  : త్వరలో జరుగబోయే సహకార ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు సీఈవో రవి తెలిపారు. మండలం మొత్తంలో ఈ సహకార ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారైనట్లు ఆయన తెలిపారు. బిజినేపల్లి మండలంలో మొత్తం 3902 ఓటరు ఉన్నారని పేర్కొన్నారు. మండలం మొత్తంలో 35 గ్రామ పంచాయతీలకు 24 రెవెన్యూ గ్రామాలు ఉండగా 13 డైరెక్టర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో డైరెక్టర్‌కు దాదాపు 301 ఓట్లు. 1వ డైరెక్టర్‌ బిజినేపల్లి ఎస్సీ జనరల్‌, 2వ బిజినేపల్లి డైరెక్టర్‌ ఎస్సీ మహిళ, ఖానాపూర్‌ జనరల్‌, వడ్డెమాన్‌ బీసీ జనరల్‌, అల్లిపూర్‌ బీసీ జనరల్‌, మమ్మాయిపల్లి ఓసీ జనరల్‌, మహదేవునిపేట వోసీ మహిళ, గంగారం జనరల్‌, లట్టుపల్లి ఎస్టీ, మంగనూరు ఓసీ, వెల్గొండ ఓసీ, వట్టెం ఓసీ జనరల్‌గా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అధికారి టీ శ్రీధర్‌, మానిటరింగ్‌ అధికారి షేక్‌ మహమూద్‌లు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. తిమ్మాజిపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, వివిద శాఖల కార్యాలయాల వద్ద అతికించినట్లు అధికారులు పేర్కొన్నారు. మండలంలో 13 డైరెక్టర్‌ స్థానాలకు ఈ నెల 6 నుంచి 8 వరకకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.  జనరల్‌ క్యాటగిరిలో అభ్యర్థులు వెయ్యి  , ఎస్సీ, ఎస్‌టీలకు రూ. 500లు, బీసీలకు రూ.750 నామినేషన్లు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 9న, ఉపసంహరణ 10న. 15న పోలింగ్‌పోలింగ్‌,  లెక్కింపు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. .నామినేషన్ల ఫారాలు విండో కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్లు సీఈవో నరేష్‌ తెలిపారు. ఓటర్ల జాబితా కార్యాలయంలో అందుబాటులో ఉందని తెలిపారు. logo