శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 23:25:23

పోషణ్‌ అభియాన్‌పై ఏకాభిప్రాయ సమావేశం

పోషణ్‌ అభియాన్‌పై ఏకాభిప్రాయ  సమావేశం

తిమ్మాజిపేట : మండలకేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో సోమవారం కన్వర్‌జెన్సీ (ఏకాభిప్రాయ)సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి మఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టిన పిల్లల నుంచి కౌమారదశ పిల్లల అభివృద్ధి, పోషకాహారం, వారిలో వచ్చే రుగ్మతలను గుర్తించి, వారికి సహాయం అందిచడంపై 9 శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేశారు. తాసిల్దార్‌ చైర్మన్‌గా ఎంపీడీవో వైస్‌ చైర్మన్‌గా కమిటీని ఎంపిక చేశారు. ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని, ప్రతి మూడు నెలలకు  ఓ సారి కమిటీ సమావేశం నిర్వహించి మండలంలో కౌమర దశ పిల్లల అభివృద్ధి పై చర్చిస్తుందని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మి తెలిపారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, తాసిల్దార్‌ సరస్వతి, ఎంపీటీసీలు  పాల్గొన్నారు.logo