గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 22:46:47

సల్లంగా సుడూ పోచమ్మ తల్లీ

సల్లంగా సుడూ పోచమ్మ తల్లీ

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ : ఈదమ్మ ఉత్సవాలు ప్రారంభానికి ముం దుగా గ్రామదేవతలకు బోనాలతో నై వేద్యం సమర్పించడం కొల్లాపూర్‌ పట్టణం లో అనవాయితీగా వస్తోంది. సోమవారం సాయంత్రం కొల్లాపూర్‌ మున్సిపల్‌ తొలి చైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మీ చంద్రశేఖరాచారి పోచమ్మదేవతకు తొలి బోనమెత్తారు. పట్టణంలోని రంగదాస్‌వీధిలోని పోచమ్మగుడి వద్దకు చైర్‌పర్సన్‌ ఎత్తుకొచ్చిన బోనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. పట్టణంలోని వేర్వేరు చోట్ల ఉన్న పోచమ్మదేవతలకు పట్టణ మహిళలు ప్రత్యేకంగా అలంకరించి పూజించిన బోనాలను తలపై ఎత్తుకొని కోళ్లు, పోటేళ్లతో  ఆయా దేవతల గుడుల వద్దకు టప్పెట్ల మోతల మధ్య తీసుకెళ్లి నైవేద్యాలను, పోటేళ్లు, కోళ్లను బలిచ్చి మొక్కుబడులను తీర్చుకున్నారు. 104 అంబున్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న పట్టణానికి చెందిన బిజ్జ చెన్నయ్య పోతురాజు వేషంలో విన్యాసం చేస్తూ పట్టణ ప్రజల్ని ఆకట్టుకుంది. పట్టణంలోని దళితుల బోనాలు ఆర్టీసీ బస్‌ డిపో వద్ద ఉన్న పోచమ్మగుడి వద్దకు, వరిదేల దళితులు చౌటబట్ల రోడ్డులో ఉన్న పోచమ్మ దేవత గుడి వద్దకు బోనాలను తీసుకెళ్లి నైవేద్యాలను సమర్పించుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వెనుకాల ఉన్న పోచమ్మగుడి వద్దకు మహిళలు బోనాలతో నైవేద్యాలను సమర్పించుకున్నారు. రంగదాస్‌ వీధిలో ఉన్న పోచమ్మగుడిని విద్యుత్‌దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. బోనాల ఊరేగింపులో చైర్‌పర్సన్‌ రఘుప్రోలు విజయలక్ష్మీ చంద్రశేఖరాచారి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఖాదర్‌ఫాషా, గోపాలమల్లయ్య, సంపంగినర్సింహా, కౌన్సిలర్‌ పస్పుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.logo