శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 00:05:45

వైభవంగా రథోత్సవం

వైభవంగా రథోత్సవం
  • గోవింద నామస్మరణలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
  • అశ్వ వాహనంపై పాలెం వెంకన్న
  • వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

తెలకపల్లి : మండలంలోని పెద్దపల్లి గ్రామంలో శనివారం రాత్రి మొదలైన బుగ్గ  స్వామి రథోత్సవం తెల్లవారుజామున ముగిసింది. రెండు రోజుల కిందట ప్రారంభమైనటువంటి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రథోత్సవాన్ని నిర్వహించారు. స్వయంబు బుగ్గ వేంకటేశ్వర స్వామి రథోత్సవం ప్రతి సంవత్సరం రథసప్తమికి నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. శనివారం రాత్రి గ్రామస్తులు రథోత్సవాన్ని నిర్వహించగా జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి సర్పంచ్‌ అనసూయమ్మ, మాజీ ఎంపీటీసీ బంగారయ్య, ఉపసర్పంచ్‌ జయరాం, టీఆర్‌ఎస్‌ నాయకులు సుధాకర్‌,  పాల్గొన్నారు. వందలాది మంది రథోత్సవాన్ని తిలకించారు. ఆదివారం రాత్రి దొప్పోత్సవ కారక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఉత్సవాలు ముగిస్తాయి. కానీ కొద్ది రో  పాటు జాతర కొనసాగుతూనే ఉంటుంది.

 

ఘనంగా దొప్పోత్సవం

బిజినేపల్లి : మండల కేంద్రంలోని శ్రీ ఆనందగిరి లక్ష్మీ  స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం దొప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో అర్చకులు వేణుగోపాల్‌ అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పురాతన గ్రామం నుంచి రంగు రంగుల కాగితాలు, పచ్చటి తోరణాలతో అలంకరించిన ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు, జీపులు, ఇతర వాహనాలు ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం రాత్రి లక్ష్మీ  స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయ సమీపం నుంచి గుట్ట మీద ఉన్న వెంకన్న ఆలయం వద్ద వరకు రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పెద్దలు ఉన్నారు. 


logo