బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Feb 03, 2020 , 00:04:51

కబడ్డీ పోటీల్లో కొట్రతండా విద్యార్థుల ప్రతిభ

కబడ్డీ పోటీల్లో కొట్రతండా విద్యార్థుల ప్రతిభ

వెల్దండ:  పరిధిలోని కొట్ర తండాకు చెందిన కేతావత్‌ జగదీశ్‌, విస్లావత్‌ లోకేశ్‌ అనే విద్యార్థులు  జాతీయ స్థాయి కబడ్డీ  పోటీలల్లో  ప్రతిభ కనబర్చి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రామోజిఫిలీం సిటీలో అల్‌ఇండియా యువకేల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో  జగదీశ్‌, లోకేశ్‌లు ప్రథమ స్థానంలో  ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు. దీంతో రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ రాములు  వారికి మోడల్స్‌, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందిచారు. ఈ సందర్భంగా ఇరువురిని పాఠశాల డైరెక్టర్‌ సురేశ్‌రెడ్డి,  రాజేందర్‌,  తల్లిదండ్రులు,  స్థానికులు అభినందించారు. 


logo