శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 03, 2020 , 00:04:51

కోయిల్‌సాగర్‌లో 28.2 అడుగుల నీటి నిల్వ

కోయిల్‌సాగర్‌లో 28.2 అడుగుల నీటి నిల్వ

దేవరకద్ర రూరల్‌ : జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్‌ కృష్ణాజలాలతో కళకళలాడుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం  28.2 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు డీఈ వెంకటరమణ తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం మొత్తం 32 అడుగులు (2.277 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 28.2 అడుగుల వద్ద నీటి నిల్వ ఉందన్నారు. గత నెల 20వ తేదీ నుంచి 29 వరకు రైతులు వేసుకున్న యాసంగి పంటలకు 10 రోజులపాటు నీటి విడుదల చేసినట్లు తెలిపారు. నారాయణపేట, కోడంగల్‌, మద్దూర్‌ మండలాలకు తాగునీటి అవసరాలకు 10 క్యూసెక్కుల నీటి తరలింపు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 


logo