మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Feb 03, 2020 , 00:03:35

శ్రీశైల దర్శనం సకల తీర్థ పుణ్యఫలం

శ్రీశైల దర్శనం సకల తీర్థ పుణ్యఫలం

శ్రీశైలం : శిరస్సు వంచి మనస్ఫూర్తిగా చేసే శివ లింగాభిషేకంతోనే లోక కల్యాణం సాధ్యమవుతుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో రెండు రోజలపాటు పార్వతీ పరమేశ్వరుల వైభవంపై  ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు అన్నారు. ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రవచకులు భక్తులనుద్దేశించి మాట్లాడారు. శ్రీశైల క్షేత్ర దర్శనంతో సకల తీర్థ పుణ్య స్నాన ఫలం, యజ్ఞఫలం లభిస్తుందన్నారు. పరమేశ్వరుడు కాలాతీతుడని భ్రమరాంబదేవి మంగళప్రదాయిని అని అభివర్ణించారు. ప్రవచన కార్యక్రమం అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను స్వామిఅమ్మవార్ల శేషవస్ర్తాలతో సత్కరించి వేదపండితులచే వేదగోష్టి నిర్వహించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ కోదండరామిరెడ్డి, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఏఈవోలు కృష్ణారెడ్డి, డీ మల్లయ్య, హరిదాసు, మధుసూదన్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, అయ్యన్న, రెవెన్యూ అధికారి శ్రీహరి, బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు పద్మావతి, శ్రీగిరి శ్రీశైల పరిరక్షణ విభాగ్‌ సభ్యులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. 


logo