శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Feb 02, 2020 , 01:52:13

మార్మోగిన గోవింద నామస్మరణ

మార్మోగిన గోవింద నామస్మరణ

బిజినేపల్లి : మండలంలోని పాలెం గ్రామంలోని అలువేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉదయం  ఆలయంలో నిత్యారాధన, ప్రబంధ పారాయణం, హోమ బలిహారణం, నివేధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. రాత్రి హోమం, బలిహారణ, రథకుంభం, బలి వంటి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలతో మార్మోగింది. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ నర్సింహస్వామి, ఈవో ఆంజనేయులు, గ్రామపెద్దలు, భక్తులు ఉన్నారు. 


logo