శనివారం 30 మే 2020
Nagarkurnool - Feb 01, 2020 , 01:01:53

కాలానుగుణంగా బోధనలో మార్పులు తెచ్చుకోవాలి

కాలానుగుణంగా బోధనలో మార్పులు తెచ్చుకోవాలి
  • డీఆర్వో మధుసూదన్‌నాయక్‌

నాగర్‌కర్నూల్‌టౌన్‌ : నేటి తరం విద్యార్థులకు మారుతున్న కాలానుగుణంగా బోధనలో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాడ్రన్‌ బీఈడీ కళాశాలలో నాగర్‌కర్నూల్‌, తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాలకు చెందిన 260 మంది పాఠశాలల ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు నిర్వహించిన చివరి నాల్గవ విడత నిష్ట శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బోధనలో నైపుణ్యం పెంపొందించేందుకు నిష్ట శిక్షణ దోహదం చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల బోధన మార్పుతో విద్యార్థులు మరింత విజ్ఞానాన్ని పొందుతారని తెలిపారు. 


విద్యా బోధనలో ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో అవసరమన్నారు.  జిల్లా వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బోధనతో పాటు పలు అంశాలపై శిక్షణ కలిగి ఉండాలన్నారు. శిక్షణతో బోధకులకు బోధన సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. మూస పద్దతులకు భిన్నంగా విద్యా బోధన జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శిక్షణతో దీక్ష దక్షతలతో ఉపాధ్యాయ లోకం పని చేయాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేటి తరం విద్యార్థులకు బోధన చేయడమంటే ప్రతిభకు పరిక్షేనని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో అశోక్‌, ఏసీ రాజశేఖర్‌రావు, జిల్లా సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి, ఎస్‌పీసీ కార్యదర్శి ప్రసాద్‌గౌడ్‌, స్ట్రాంగ్‌ టీచర్‌ వెంకటేశ్వర్లుశెట్టి, ఉపాధ్యాయులు వెంకటయ్య, పర్వతాలు, కృష్ణప్రసాద్‌లు పాల్గొన్నారు. 


logo