శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Feb 01, 2020 , 00:54:33

శ్రీగిరిలో రథసప్తమి వేడుకలు

శ్రీగిరిలో రథసప్తమి వేడుకలు

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి పర్వదిన సందర్భంగా ప్రత్యేకంగా సూర్యారాధన పూజలు నిర్వహించబడుతాయని కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. శనివారం ఉదయం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్య భగవానుడికి శాస్ర్తోక్తంగా షోడశోపచార క్రతువులు జరిపించడంతో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుందని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ సూర్యారాధన చేయనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మాడవీధిలో సూర్య నమస్కార ఆసనాలు వేయించి వాటి విశిష్టతను తెలియజేప్పేందుకు ప్రముఖ యోగా గురువులచే ప్రత్యేక కార్యక్రమాన్ని దేవస్థానం ఆధ్వర్యంలొ తొలిసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. logo