శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 31, 2020 , 02:20:51

గాంధీజీకి ఘన నివాళి

గాంధీజీకి ఘన నివాళి
  • నడింపల్లిలో మహాత్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన విప్‌ గువ్వల
  • జిల్లావ్యాప్తంగా జాతిపితకు నివాళి
  • కలెక్టరేట్‌ కార్యాలయంలో పాల్గొన్న జేసీ శ్రీనివాస్‌ రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ :  ప్రపంచానికే శాంతి సందేశం అందించిన మహనీయుడు గాంధీజీ అని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యం, అహింసా సిద్ధాంతాల ద్వా రా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గాంధీజీ మార్గం  ఆచరణీయమని కొనియాడారు. గాంధీజీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు.  కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్‌, కొల్లాపూర్‌ ఆర్డీవో శ్రీరాములు, కలెక్టరేట్‌ కార్యాలయ సి బ్బంది, అధికారులతో కలిసి చిత్ర పటానికి నివాళులర్పించారు.  కార్యక్రమంలో మండల బాధ్యులు శ్రీధర్‌,సుధాకర్‌రెడ్డి, లక్ష్మణస్వామి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


 దేశ భక్తిని  పెంపొందించుకోవాలి

బిజినేపల్లి : విద్యార్థులు దేశభక్తిపై మ క్కువ పెంచుకోవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో జరిగిన మహాత్మాగాంధీ వర్థంతిలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అహింసా  సిద్ధ్దాంతంతో గాంధీజీ  ప్రపంచంలో అతి శక్తి వంతమైన వ్యక్తిగా గుర్తించబడ్డారన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. అనంతరం కస్తూర్బాలో స్టోర్‌రూంలో ఉన్న సరుకులను పరిశీలించారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారి ఆహ్మద్‌, నాగమణి పాల్గొన్నారు. logo