గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 31, 2020 , 02:20:51

వైభవంగా జ్ఞాన సరస్వతీ మాత ఉత్సవాలు

వైభవంగా జ్ఞాన సరస్వతీ మాత ఉత్సవాలు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : జిల్లా కేంద్రంలో సమీపంలోని కొల్లాపూర్‌ చౌరస్తాలోగల జ్ఞాన సరస్వతీ  దేవాలయంలో ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం మాఘమాసం వసంత పంచమి సందర్భంగా  దేవాలయం ఆవరణలో వివిధ ప్రాంతాల  భక్తులచే వేద బ్రాహ్మణులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు వాగ్ధేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయించుకున్న వారికి భవిష్యత్‌లో విశేష జ్ఞానాలు పొందుతారన్నారు. అమ్మవారిని నిత్యం స్మరిస్తే అమ్మవారి ప్రాప్తితోనే వినయం విజ్ఞానం ప్రాప్తిస్తాయని తెలిపారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు విడతల వారీగా అక్షరాభ్యాసాలు, కుంకుమార్చనలు, అనన్నప్రసాదాలు ఆలయ ఆవరణలో నిర్వహించారు. భక్తులు, మహిళలతో ఆలయ ఆవరణ సరస్వతీనామ స్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా మహిళలచే ఆలయం ఆవరణలో నిర్వహించిన కోలాటాల ప్రదర్శన అలరింపజేసింది.  కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష్య, కార్యదర్శులు వలిశెట్టి లక్ష్మిశేఖర్‌, ఈశ్వరయ్య, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు దొడ్ల నారాయణరెడ్డి, ఆలయకమిటీ సభ్యులు ఇందుమతి, జగదీశ్వర్‌, శారద, విశ్వనాథం, శివశంకర్‌, శ్యా ంసుందర్‌రెడ్డి, సోమిశెట్టి రవి, సహాయ అర్చకులు కనక దండి సీతారామమూర్తి, నవీన్‌కుమార్‌, మహిళలు,చిన్నారులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 


logo